హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారసత్వం: అసంతృప్తి.. హరీష్ రావు పేరు లాగిన మంత్రి కెటిఆర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వారసత్వంపై జరుగుతున్న చర్చ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఇబ్బందిని కలిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. దీంతో కెసిఆర్ వారసుడు కెటిఆర్ అనే అంశం చర్చకు వచ్చింది.

స్వయంగా కెటిఆర్ సోదరి, ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కెసిఆర్ వారసుడు కెటిఆరేనని, అయితే ఇప్పుడే చర్చ అనవసరమని తేల్చి చెప్పారు. టిఆర్ఎస్‌లో, రాజకీయ వర్గాల్లో వారసుడి పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. జరుగుతోంది.

KCR political hire: KTR names Harish Rao

ఇది కెటిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన తన బావ, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరును ప్రస్తావించారట. వారసత్వం పైన ప్రచారం ఎందుకోనని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

హరీష్ రావు ఎన్నో ఉప ఎన్నికలలో గెలిపించారని, అప్పుడు వారసత్వం పైన ఎలాంటి ప్రచారం జరగలేదని కెటిఆర్ వాపోయారు. గతంలోను మంత్రి హరీష్ రావు పలుమార్లు పార్టీని, పార్టీ అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు. ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించారన్నారు. ప్రస్తుతం నేను, హరీష్ రావు తమ మంత్రిత్వ శాఖల పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పారు. పని లేనప్పుడు మాత్రమే వారసత్వం గురించి మాట్లాడుతారన్నారు.

English summary
Minister KCR political hire: KTR names Harish Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X