వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా కరాటే ప్లేయర్, పైలట్లకు కెసిఆర్ భరోసా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌ సయిదా ఫలక్‌కు, తెలంగాణ తొలి మహిళా పైలట్‌ స్వాతిరావుకు అవసరమయ్యే శిక్షణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. వారిద్దరు సోమవారంనాడు కెసిఆర్‌ను కలిశారు.

హైదరాబాద్ పాతనగరానికి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. గతంలో కూడా ఎన్నో అవార్డులు తెచ్చుకున్నది. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో రాణించడంతోపాటు భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అదే విధంగా అదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన గంటా స్వాతిరావు 2006లో పైలట్‌గా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి మొదటి పైలట్ అయిన స్వాతిరావు ఫిలిప్పీన్స్‌లో ఫ్లయిట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎయిర్‌బస్ పైలట్‌గా మారడం కోసం అవసరమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంది.

ఎయిర్ బస్ పైలట్‌గా మారేందుకు

ఎయిర్ బస్ పైలట్‌గా మారేందుకు

ఎయిర్ బస్ పైలట్‌గా మారడానికి స్వాతిరావు అవసరమైన శిక్షణను తీసుకోవాల్సి ఉంది. ఇందుకు తగిన సహాయం కోసం ఆమె కెసిఆర్‌ను కలిశారు.

ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి..

ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి..

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాతిరావును సోమవారం సీఎం కేసీఆర్ వద్దకు తీసుకువచ్చారు. ఆమెను అభినందించిన సీఎం శిక్షణకు అవసరమైన ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు.

తొలి మహిళా పైలట్

తొలి మహిళా పైలట్

తెలంగాణ నుంచి తొలి మహిళా పైలట్‌గా స్వాతిరావు కీర్తిని దక్కించుకుంది. ప్రస్తుతం పిలిప్పీన్స్‌లో ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది.

కరాటే ప్లేయర్ సయిదా..

కరాటే ప్లేయర్ సయిదా..

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరిగే 13వ సీనియర్ ఏషియన్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం తరఫున సయిదా ఫలక్ పాల్గొననున్నది. అందుకోసం మెరుగైన శిక్షణ అవసరమైన నేపథ్యంలో సయిదాఫలక్ సెక్రటేరియట్‌లో సోమవారం సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు.

సిఎంతో భేటీ, భరోసా

సిఎంతో భేటీ, భరోసా

కరాటేలో రాణిస్తున్న సయిదాను అభినందించిన సీఎం శిక్షణకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు.

English summary
Hyderabad old city karate player sayeeda Phalak and Telangana first ever woman pilot Ganta Swati rao from Adilabad district met CM K Chandrasekhar Rao (KCR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X