మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నా నేనున్నా, ఫోన్ చేయి, దొమ్మాట మాజీ ఎమ్మెల్యేతో కెసిఆర్

అన్నా.... ఈ తమ్ముడు ఉన్నాడని మరువకు, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: అన్నా.... ఈ తమ్ముడు ఉన్నాడని మరువకు, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కోరారు.

దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి దీనస్థితిపై ఇటీవల మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు.

 Kcr provides housesite Dommata EX.Mla Ramachandra Reddy
నేవీలో ఆఫీసర్ గా పనిచేసి , రాజకీయాల్లోకి వచ్చారు రామచంద్రారెడ్డి.1980 దశకంలో టిడిపి తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్టీఆర్ తో విభేదించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఆర్థికంగా చితికిపోయాడు. ఇటీవలే ఆయన కొడుకు మరణించాడు.దీంతో ఆయన మరింత కృంగిపోయాడు. ఎమ్మెల్యే కోటాలో కూడ ఆయనకు ఇంటిస్థలం కూద దక్కలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇదంతా గుర్తు పెట్టుకొన్న సిఎం కెసిఆర్ కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత రామచంద్రారెడ్డికి వెంటనే సిద్దిపేటలో ఇంటిస్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ వెళ్తుండగా కూతుళ్ళు సీత, గీతతో కలిసి రామచంద్రారెడ్డి కెసిఆర్ ను కలిసేందుకు వచ్చారు. వెంటనే సీఎం ఆయనతో ఆప్యాయంగా భోజనం చేస్తూ మాట్లాడుకొందాం పద అన్నా అంటూ ఆయన వెంట తీసుకెళ్ళారు.

వేద పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన భోజనం చేయాలని రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. అయితే తాను మందులు వేసుకోలేదనన్నారు. మందులు వేసుకొన్న తర్వాతే మధ్యాహ్న భోజనం చేస్తానన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి అన్నా...వదినకు నమస్తే చెప్పు అంటూ ఆయనతో అన్నారు.

English summary
Telangana chief minister Kcr ordered Siddipet collector Venkatram Reddy to provide housesite to former Dommata MLA Ramachandra Reddy on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X