వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధికి నిధులివ్వండి: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాతో కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను సమకూర్చే బాధ్యత నీతి ఆయోగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. తిరిగి వాటిని చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియా గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణ, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చజరిగింది. విభజన బిల్లులో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని సీఎం కెసిఆర్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియాను కోరారు.

అదేవిధంగా, రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పనగారియ సానుకూలంగా స్పందించారు. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతిఆయోగ్ మరింత సమర్థవంతంగా పని చేయాలని సీఎం ఆకాంక్షించారు. గతంలో నీటి ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతోపాటు రాష్ర్టాల నుంచి తీసుకోవాలన్నారు. దీని వల్ల నీతి ఆయోగ్ కూడా బలోపేతమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరితహారం తదితర పథకాలను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు వివరించారు.

అరవింద్ పనగరియా

అరవింద్ పనగరియా

రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను సమకూర్చే బాధ్యత నీతి ఆయోగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. తిరిగి వాటిని చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

కెసిఆర్-పనగరియా

కెసిఆర్-పనగరియా


నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియా గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

కెసిఆర్-పనగరియా

కెసిఆర్-పనగరియా

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణ, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చజరిగింది.

కెసిఆర్-పనగరియా

కెసిఆర్-పనగరియా

విభజన బిల్లులో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని సీఎం కెసిఆర్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియాను కోరారు.

కెసిఆర్-పనగరియా

కెసిఆర్-పనగరియా

అదేవిధంగా, రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పనగారియ సానుకూలంగా స్పందించారు.

కెసిఆర్

కెసిఆర్

క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్, పక్కనే రాష్ట్ర మంత్రులు.

నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానంతోపాటు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగరియా అభినందించారు. కేంద్రం వద్ద మూలుగుతున్న కాంపా నిధులను వాటా ప్రకారం రాష్ర్టాలకు ఇవ్వాలని సీఎం కెసిఆర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరారు.

సమావేశంలో మంత్రులు కె తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జిఆర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రదీప్‌చంద్ర, బీపీ ఆచార్య, నర్సింగరావు, ఎంజీ గోపాల్, సోమేశ్‌కుమార్, రాజేశ్వర్ తివారీ, ఎస్‌కె జోషి, రేమండ్‌పీటర్, శాంతికుమారి, స్మితా సబర్వాల్, నీతి ఆయోగ్ అధికారులు తపస్య, అశోక్‌జైన్ పాల్గొన్నారు.

సీఎంతో సమావేశానికి ముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింగ్‌పనగరియాతోపాటు అధికారులు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కిషన్‌నగర్ గ్రామాన్ని సందర్శించారు.

నందిగాంలో మిషన్‌కాకతీయ పనులు, రాయికల్‌లో పాలీహౌస్‌జ్‌ను పరిశీలించారు. అంతకుముందు అరవింద్ పనగరియాకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిపి ఆచార్య, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి ఘన స్వాగతం పలికారు.

English summary
Chief minister K Chandrasekhar Rao suggested Niti Aayog vice-chairman Arvind Panagariya on Thursday that the Centre should continue providing funds through the body for irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X