వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ కంపెనీలు తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గురువారం థింక్ కాపిటల్ ఛైర్మన్ డి రవిరెడ్డి, థింక్ ఎనర్జీ ఛైర్మన్ ప్రశాంత్ మిట్టల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు విద్యుత్, వ్యర్థజలం టెక్నాలజీపై తాము చేస్తున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా వ్యర్థజలాన్ని పునర్వినియోగించేలా తీర్చిదిద్దడం, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వారు తమ ఆసక్తిని సిఎం కెసిఆర్‌కు తెలియజేశారు.

వీటితో పాటు గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయగల సాంకేతిక సామర్థ్యం కూడా తమ సంస్థలకు ఉందని వారు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికలతో రావాలని వారిని కోరారు.

'మీరు చెప్పిన టెక్నాలజీ, ప్రాజెక్టులను పరిశీలిద్దాం.. సమీక్షించి స్థానికంగా అమలుకు నిర్ణయం తీసుకుందాం' అని వారికి సిఎం చెప్పారు. పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికలతో వస్తే ఓ నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుందని ఆయన వారికి తెలిపారు.

కెసిఆర్‌తో అమెరికా కంపెనీల ప్రతినిధులు

కెసిఆర్‌తో అమెరికా కంపెనీల ప్రతినిధులు

అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ కంపెనీలు తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.

కెసిఆర్‌తో అమెరికా కంపెనీల ప్రతినిధులు

కెసిఆర్‌తో అమెరికా కంపెనీల ప్రతినిధులు

గురువారం థింక్ కాపిటల్ ఛైర్మన్ డి రవిరెడ్డి, థింక్ ఎనర్జీ ఛైర్మన్ ప్రశాంత్ మిట్టల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సిఎంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు

సిఎంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు

పౌష్ఠికాహార లోపంతో బాధ పడుతున్న గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్‌లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బార్రీ జే పాల్‌మర్ మాట్లాడుతూ.. తమ సంస్థ దేశ వ్యాప్తంగా సేవలందిస్తుందన్నారు.

సిఎంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు

సిఎంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు

గురువారం సచివాలయంలో తనను కలిసిన ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లావాసులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ వంటి సంస్థల సేవలు అవసరమని, ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు.

విద్యుత్‌పై సమీక్ష

విద్యుత్‌పై సమీక్ష

రాష్ర్టానికి అవసరమైన విద్యుత్ కొనుగోలుకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి కె ద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao on Thursday asked the chairmen of two US based companies dealing with waste water technology and development of energy projects to come up with detailed project reports when they evinced interest to participate in the development of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X