వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావు నుండి బాహుబలి వరకు: బాబుపై కెసిఆర్ పక్కా ప్లాన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి సినిమా పరిశ్రమను చేతుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారా!? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమ తనదే అన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నారని కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

అది పక్కన పెడితే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కెసిఆర్ తీరు చూస్తే పరిశ్రమ పైన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకు తెలంగాణ సెంటిమెంట్ అంశం కూడా కెసిఆర్‌కు కలిసి వస్తోందని చెప్పవచ్చు.

చంద్రబాబు - కెసిఆర్

చంద్రబాబు - కెసిఆర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి సినిమా పరిశ్రమను చేతుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారా!? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ

తెలంగాణ ఏర్పడక ముందు.. రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానని చెప్పిన కెసిఆర్.. అధికారంలోకి వచ్చాక దానికి కితాబిస్తున్నారని విపక్షాలు పలుమార్లు మండిపడ్డారు. ఆర్ఎఫ్‌సీ అధ్భుతమని కెసిఆర్ ప్రశంసించారు. ఓసారి ఆర్ఎఫ్‌సీ వెళ్లారు కూడా.

 బాహుబలి

బాహుబలి

సీఎం కెసిఆర్ శనివారం నాడు బాహుబలి చిత్రాన్ని వీక్షించనున్నారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు సీఎం కోసం రేపు ప్రత్యేక షో వేస్తున్నారని తెలుస్తోంది.

బస్తీ

బస్తీ

సహజనటి జయసుధ తనయుడి బస్తీ చిత్రం విడుదల కార్యక్రమానికి కెసిఆర్ హాజరయ్యారు. గతంలో సినీ పరిశ్రమ కూడా సీమాంధ్రుల చేతిలో ఉందని టీఆర్ఎస్ విమర్శించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. బస్తీ ఆడియో విడుదలకు టీడీపీ నేత మురళీ మోహన్ కూడా హాజరయ్యారు.

రాజేంద్ర ప్రసాద్

రాజేంద్ర ప్రసాద్

మా అధ్యక్ష ఎన్నికల్లో జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌లు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచిన రాజేంద్ర ప్రసాద్ వర్గం... తమ గెలుపు వెనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారని చెప్పడం గమనార్హం. మరోవైపు, జయసుధ తనయుడి బస్తీ ఆడియో విడుదలకు కెసిఆర్ హాజరు కావడం గమనార్హం.

కెసిఆర్ వ్యూహాత్మకంగా

కెసిఆర్ వ్యూహాత్మకంగా

ఆంధ్రులకు హైదరాబాద్‌లో భద్రత లేదంటూ చంద్రబాబు వాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా పరోక్షంగా చేసిన సందర్భాలు ఉన్నాయి.

కెసిఆర్ వ్యూహాత్మకంగా

కెసిఆర్ వ్యూహాత్మకంగా

బస్తీ ఆడియోకు విడుదల కార్యక్రమానికి హాజరు కావడం. బస్తీ ఆడియోలో కెసిఆర్ ప్రసంగం కూడా ఆసక్తికరంగా కనిపించింది. కార్యక్రమానికి హాజరు కాని అక్కినేని నాగార్జున, వెంకటేష్, చిరంజీవి పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వివాదం నేపథ్యంలో కెసిఆర్ చాలా జాగ్రత్తగా ఎవరికీ తాము వ్యతిరేకం కాదనే పద్ధతిలో మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కెటిఆర్

కెటిఆర్

కొద్ది రోజుల క్రితం ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆస్క్ కెటిఆర్ వేదికగా.. తాను బాహుబలి చిత్రాన్ని చూస్తానని చెప్పారు. తెలుగువారు గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి అని కితాబిచ్చారు. కాగా, తెలంగాణలో సినిమా పరిశ్రమకు పెద్ద పీట వేస్తామని, రెండువేల ఎకరాల్లో చిత్రపురిని నిర్మిస్తామన్న కెసిఆర్ చెప్పారు. పైన సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, ఏర్పాటు చేయబోయే చిత్రపురికి కేసీఆర్ ఫిల్మ్ సిటీ అని పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

English summary
Telangana CM KCR strategy on film industry!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X