వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను రాళ్లతో కొట్టి చంపండి!: కెసిఆర్, లాజిక్ లాగిన జగన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్యనేతలు ఓరుగల్లులో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రచారం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆయా పార్టీల నేతలు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.

హన్మకొండ ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను ఇచ్చిన మాటను తప్పితో రాళ్లతో కొట్టి చంపేయండన్నారు. కోటి ఎకరాలకు నీరు తెచ్చేదాకా నిద్రపోనని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు తీసుకొని నోరు మూసుకున్న వారు నన్ను విమర్శిస్తారా అని మండిపడ్డారు.

మరోవైపు, కెసిఆర్ తన ఏడాదిన్నర పాలనలో ఏం చేయలేదని, ఆయనను నిలదీయాలని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు ఓటు వేసినా వేయకపోయినా కెసిఆర్ ప్రభుత్వం పడిపోదని, కానీ పొరపాటున కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, తన పరిపాలన బాగుందని కెసిఆర్.. ప్రజలను మరిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల మీద ఇంకా పెద్ద పెద్ద బండలు వేసే రోజులు వస్తాయన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదరికం పోయేదాకా, దళితులు, బీసీ, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే దాకా అహోరాత్రులు కృషిచేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

 కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని, 2018 నాటికి కనురెప్పపాటు కూడా కరెంటు పోనంతగా 24 గంటలూ విద్యుత్తు ఉండేలా చూస్తానని పేర్కొన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

కెసిఆర్

కెసిఆర్

ఉద్యమ సమయంలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా వరంగల్‌వారే తనను దీవించారని, 30 లక్షల మందితో సభ పెడతామంటే అలాంటి అద్భుత ప్రయత్నాల్ని కూడా చేసి చూపిన జిల్లా ఇదని గుర్తు చేశారు.

 కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్‌ చేసిన సాయం మర్చిపోలేనిదని, ఈ ఎన్నికల్లో కూడా ఎవరూ ఊహించని పద్ధతిలో తెరాసను గెలిపించాలని ఆయనకోరారు. పసునూరి దయాకర్‌ని దీవించి... తెరాసపార్లమెంటు సభ్యులను పెంచండని పేర్కొన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

గతంలో చేతకాక మంత్రిపదవులు తీసుకుని నోళ్లు మూసుకున్న తెలంగాణ కాంగ్రెస్‌, టిడిపి నేతల వల్ల సంక్రమించిన దరిద్రాన్ని పోగొట్టడానికి తెరాస తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని కెసిఆర్ అన్నారు. ఈ పని తీరును ప్రజలే చూసి చెప్పాలని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బిజెపి నేతలమీద తీవ్ర విమర్శలు చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కెసిఆర్ తన ఏడాదిన్నర పాలనలో ఏం చేయలేదని, ఆయనను నిలదీయాలని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్య పైన కెసిఆర్‌ను నిలదీయాలన్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు ఓటు వేసినా వేయకపోయినా కెసిఆర్ ప్రభుత్వం పడిపోదని, కానీ పొరపాటున కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, తన పరిపాలన బాగుందని కెసిఆర్.. ప్రజలను మరిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల మీద ఇంకా పెద్ద పెద్ద బండలు వేసే రోజులు వస్తాయన్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

పేదరికం అంటే ఏమిటో తెలుసా, పేదవాడు ఎందుకు అప్పులపాలు అవుతున్నాడనే ఆలోచన చేశారా అని ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

పేదవాడు అప్పుల పాలు కావడానికి రెండు కారణాలు ఉంటాయని.. ఒకటి అనారోగ్యం, రెండోది పెద్ద చదువులు అన్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

పేదవానికి హఠాత్తుగా ఏమైనా జబ్బు చేస్తే ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతుందని, నూటికి రూ.2 నుంచి రూ.5 వడ్డీ అయినా పర్వాలేదని చెప్పి లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకొని పేదవాడు అప్పుల పాలవుతాడన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అందుకే వైయస్ గొప్పగా ఆలోచన చేసి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 108 నెంబర్‌కు ఫోన్ కొడితే ఇరవై నిమిషాల్లో పేదవాని ఇంటి ముందు వెళ్లి రోగిని తీసుకొని ఆసుపత్రికి వైద్యం చేయించే విధంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చారన్నారు.

English summary
People of Warangal have always helped the TRS in times of crisis and they should do so once again by ensuring the victory of party in this byelection, said Chief Minister K Chandrasekhar Rao here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X