వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుపై కేసీఆర్ అసంతృప్తి, అందుకే కడియంకు?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నియామకాల పర్యవేక్షణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అఫ్పగించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై అసంతృప్తితో ఆయన కడియంకు బాధ్యతలు అప్పగించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నియామకాల పర్యవేక్షణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అఫ్పగించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై అసంతృప్తితో ఆయన కడియంకు బాధ్యతలు అప్పగించారు.

కమిషన్ తీరుపై అందుకే అసంతృప్తి

కమిషన్ తీరుపై అందుకే అసంతృప్తి

పలు నోటిఫికేషన్లు కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం, ప్రత్యేకించి గ్రూప్ 2 వివాదంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం కావడం వంటి అంశాల వల్ల కెసిఆర్.. సర్వీస్ కమిషన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

Recommended Video

Pawan Kalyan with Chandrababu
జాగ్రత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతోందనే

జాగ్రత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతోందనే

అందుకే ఉద్యోగ నియామకాల పర్యవేక్షణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అఫ్పగించారని అంటున్నారు. అవకాశం ఉన్నచోట క్లియరెన్స్ ఇస్తున్నా సరే, కమిషన్ న్యాయవివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతోందనేది సీఎం భావన.

అప్పగింతపై చర్చ

అప్పగింతపై చర్చ

కడియం శ్రీహరికి బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు కూడా ఉన్నాయి. సర్వీస్ కమిషన్ వంటి ఓ స్వతంత్ర కానిస్టిట్యూషనల్ సంస్థకు ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణ బాధ్యతలు ఎలా అనే చర్చ సాగుతోంది.

స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా

స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా

అయితే, సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కొన్ని పరిమితుల మేరకే కమిషన్ ప్రతి అవసరానికి సాధారణ పాలనా విభాగంపై ఆధారపడాల్సిందే. ప్రభుత్వం చెప్పినన్ని పోస్టులకు, చెప్పిన అర్హతలతో పరీక్షలు నిర్వహించి, జాబితాను ప్రభుత్వానికి వరకే కమిషన్ బాధ్యత. సాధారణ పాలనా విభాగం వ్యవహారాలు చూసేది సీఎం.. తన బాధ్యతల ఒత్తిడిలో తాను వీటిని పర్యవేక్షించలేనప్పుడు తన తర్వాత అంతటిస్థాయి డిప్యూటీ సీఎంకు ఇవ్వడం అంటే పాలన కోణంలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Telangana CM K Chandrasekhar Rao unhappy with Telangana public service commission?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X