వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు దత్తత తీసుకోండి: కెసిఆర్, చూస్తామన్న కంపెనీలు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోని 95 గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విత్తన కంపెనీలకు సూచించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో సోమవారం విత్తన ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో, వ్యవసాయ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

సీఎం వారితో ముఖాముఖి మాట్లాడి విత్తన ఉత్పత్తిలో ఎదురవుతున్న సవాళ్లను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని జాతీయస్థాయిలో విత్తన భాండాగారంగా మార్చడానికి విత్తన ఉత్పత్తి కంపెనీలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు.

విత్తన ఉత్పత్తిదారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని విత్తన ఉత్పత్తితోపాటు అధిక దిగుబడులపై రైతులను చైతన్యవంతులను చేయాలని సూచించారు. విత్తన ఉత్పత్తి కంపెనీలకు ప్రభుత్వపరంగా అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు.

విత్తన ఉత్పత్తి కంపెనీలు, వ్యవసాయ అధికారులు కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఒక్కొక్క విత్తన కంపెనీ మొదటిదశలో తెలంగాణలోని 95 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు.

కంపెనీ దత్తత తీసుకున్న గ్రామాలలో రైతులను విత్తనాల ఉత్పత్తికి ప్రోత్సహించాలని, మేలురకమైన సాగు పద్ధతులను నేర్పాలన్నారు. సానుకూలంగా స్పందించిన విత్తన కంపెనీల ప్రతినిధులు మళ్లీ సమావేశమై గ్రామాల్ని దత్తత తీసుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకుని విధి విధానాలు తయారు చేసుకుంటామన్నారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

'తెలంగాణలో విభిన్న స్వభావం కలగిన నేలలున్నాయి. సమశీతోష్ణ వాతావరణం ఉంది. మంచి వర్షపాతం ఉంది. ఈ పరిస్థితులు విత్తనాల ఉత్పత్తికి ఎంతో అనుకూలించే అంశం. అందుకే ఇక్రిశాట్‌తోపాటు దాదాపు 364 విత్తన కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. దేశ విత్తన రాజధానిగా తెలంగాణకు పేరుంద'ని కెసిఆర్ అన్నారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

దేశానికి అవసరమయ్యే 80 శాతం విత్తనాలు తెలంగాణలో తయారవుతున్నాయని, 2.90 లక్షల ఎకరాలలో విత్తన ఉత్పత్తి జరుగుతోందని, ఈ పరిస్థితిని మరింత సానుకూలంగా మలుచుకుని తెలంగాణలో విత్తన ఉత్పత్తిని మరింత పెంచాలన్నారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

కనీసం ఆరులక్షల ఎకరాలలో విత్తన ఉత్పత్తి జరగాలని, రైతులకు ఉపయోగపడాలని, దేశానికి ఏ రకమైన విత్తనాలు అవసరం? మనం ఎంత ఉత్పత్తి చేయాలి? ఏ ప్రాంతంలో ఏ విత్తనాలు పండించాలి? అనే అంశాలపై అవగాహనకు రావాలన్నారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, వ్యవసాయ యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. పరిశోధనలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి తరలివెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao has asked the seed companies to adopt one village each in 95 rural Assembly Constituencies in the State to encourage seed production by educating them on better cultivation methods and use of technology, as part of the government’s plans to make the State seed bowl of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X