హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్ప్ ప్లీజ్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగు వారిని రక్షించండంటూ కేసీఆర్ లేఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగువారు బలరాం, గోపీకృష్ణలు క్షేమంగా తిరిగిరావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వారిని భారత్‌కు క్షేమంగా తిరిగి వచ్చేలా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిబియాను కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం విదేశీ మంత్రిత్వ శాఖకు తెలంగాణ సీఎస్‌ రాజీవ్ శర్మ లేఖరాశారు.

మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అధికారులు విదేశీ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. కరడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లిబియాలో నలుగురు భారతీయులను గురువారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్‌నకు గురైన వారిలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ, కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌ ఉన్నారు.

కర్ణాటకు చెందిన లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌ను ఉగ్రవాదులు క్షేమంగా విడిచిపెట్టారు. అయితే తెలుగు వారిద్దరిని విడిచిపెట్టారా లేదా అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. తెలుగువారిద్దరూ కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారా? సురక్షితంగా బయటపడ్డారా అనే అంశంపై గందరగోశం నెలకొంది.

kcr write a letter to central govt over telugu people in libya

కర్ణాటకు చెందిన విజయకుమార్‌, లక్ష్మీకాంత్‌ విడుదలైన విషయాన్ని ధ్రువీకరించిన విదేశాంగ శాఖ, తెలుగు వారైన బలరాం, గోపికృష్ణ విడుదలపై స్పష్టతివ్వలేదు. దీంతో కుటుంబ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
బలరాం కుటుంబం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో, గోపీకృష్ణ కుటుంబం నాచారంలో నివసిస్తోంది.

శనివారం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమవారిని క్షేమంగా విడుదల చేసేలా చూడాలని కోరారు. ‘ఉయ్‌ ఆర్‌ సేఫ్‌(మేం క్షేమంగానే ఉన్నాం)'' అంటూ లక్ష్మీకాంత్‌ మొబైల్‌నుంచి బలరాం భార్య శ్రీదేవికి గురువారం సందేశం వచ్చింది.

దీనిపై బలరాం భార్య శ్రీదేవి మాట్లాడుతూ విదేశాంగ శాఖ నుంచి తన భర్త గురించి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. అందోళనతో ఉన్న తమ వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

కిడ్నాప్‌కు గురైన నలుగురూ లిబియాలోని సిర్టే వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు ట్రిపోలీ, టునిస్‌ మీదుగా భారత్‌కు వీరు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో కారులో వస్తుండగా సిర్టే పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పోస్ట్‌ వద్ద వీరిని ఉగ్రవాదులు అపహరించారు.

English summary
kcr write a letter to central govt over telugu people in libya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X