వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఫొటో మార్ఫింగ్: టీ న్యాయవాదుల ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫొటోను మార్ఫింగ్ చేసినందుకుగాను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ ఉద్యోగిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కెసిఆర్‌‌ను నపుంసకుడిగా చూపుతూ ఫొటోను మార్ఫింగ్ చేసి అతను సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లో పోస్టు చేశాడు.

కెసిఆర్ ఫొటో మార్ఫింగ్‌పై తెలంగాణ ముస్లిం న్యాయవాదుల వేదిక అధ్యక్షుడు వహీద్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందికి చెందిన వాజి‌హుస్ షామ్స్ ఓ ఫొటోను పోస్టు చేశాడని అహ్మద్ ఆరోపించారు.

షామ్స్ ఆ చిత్రాన్ని పోస్టు చేయడం ద్వారా కెసిఆర్ ప్రతిష్టను మాత్రమే కాకుండా తెలంగాణ ప్రతిష్టను కూడా దెబ్బ తీశాడని ఆయన అన్నారు. ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని షామ్స్ తనను బెదిరించినట్లు కూడా వాహిద్ చెప్పారు.

KCRs photo morphed, TS advocate goes to police

తనను బెదిరించిన విషయంపై వాహిద్ నాంపల్ిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2008 ఐటి చట్టంలోని సెక్షన్ 66(ఏ) కింద షామ్స్‌పై ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు, దానిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

‌కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌పై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

English summary
The cyber crime police has registered an FIR against a Maulana Azad National Urdu University employee for allegedly posting a morphed image showing Telangana state Chief Minister K. Chandrasekhar Rao as a eunuch, on a social networking websites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X