ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ జీ !: ఖమ్మం ఐటీ హబ్ సరే.. కరీంనగర్ సంగతేమిటి?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసిందీ కరీంనగర్ జిల్లా. ఉద్యమానికి నాయకత్వం వహించడంతోపాటు రాష్ట్ర ఏర్పాటుకు అండగా నిలిచిన కరీంనగర్‌లో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని గతేడాది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందీ ఇదే జిల్లా కేంద్రంలో కావడం గమనార్హం.

నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు టీఆర్ఎస్ అధ్యక్షుడు - సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా అనేక సార్లు పరంగా రాజకీయంగా పూర్తి అండదండలు ఇచ్చింది. 2004లో సాధారణ ఎన్నికలు, 2006, 2008 ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని కాపాడుకునేందుకు కరీంనగర్ వాసులు మూడుసార్లు కేసీఆర్‌ను లోక్‌సభకు పంపారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్లలో తొలిసారి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి కేటీఆర్ 2010 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. కరీంనగర్‌లో హామీ ఇచ్చి ఖమ్మంలో మొదట ఐటీ పార్కుకు శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

2014 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా ప్రజలు 12 మంది శాసన సభ్యులు, 3 ఎంపీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో తెరాసను గెలిపిస్తే అధికార పార్టీ నేతలంతా ఐటీ పార్కు విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన కరీంనగర్ జిల్లా పట్ల నిర్లక్ష్యం దేనికని తెలంగాణ వాదులు, రాజకీయ విశ్లేషకులు, ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

మెదక్ వెళ్లిపోయిన ఉద్యానవర్సిటీ

మెదక్ వెళ్లిపోయిన ఉద్యానవర్సిటీ

2004 నుంచి 2008 నుంచి మూడుసార్లు తనను గెలిపించుకున్న కరీంనగర్‌ ప్రజలకు ‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి రుణం తీర్చుకుంటాను' అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఐటీ పార్కు విషయంలో చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో ఉండాల్సిన ఉద్యాన విశ్వవిద్యాలయం మెదక్‌కు వెళ్లిపోయిందని చెప్తున్నారు. సిరిసిల్లలో 50వేలకు పైగా మరమగ్గాలు ఉన్నా అక్కడ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయకుండా వరంగల్‌లో చేస్తున్నారని, లెదర్‌ పార్కు కూడా తరలిపోయిందని చేనేత కార్మికులు అంటున్నారు.

సీఎం కేసీఆర్ హామీలు విస్మరించారా?

సీఎం కేసీఆర్ హామీలు విస్మరించారా?

అధికారంలోకి వచ్చిన తరువాత కరీంనగర్‌ వచ్చిన సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆచరణలో కొత్తగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు విస్మరిస్తున్నారని విమర్శకులు ప్రశ్నించారు.

ఖమ్మం ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

ఖమ్మం ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

ఐటి పార్కు ఏర్పాటు ద్వారా ఉద్యోగ అవకాశాలు కరీంనగర్ జిల్లా వాసులకు పెరుగుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఉపాధి అవకాశాల కల్పించేందుకు కోసం ఖమ్మం నగరంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్‌లో కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఐటీ హబ్ ఏర్పాటుకు కేటాయించారు. దీనిని అభివ్రుద్ది చేసేందుకు టీఎస్‌ఐఐసీకి అప్పగించేశారు. ఐటీ హబ్ నిర్మాణానికి దాదాపు రూ. 15 కోట్లను మంజూరు చేయటంతోపాటు భవన నమూనాలు సిద్ధమయ్యాయి. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

కరీంనగర్ హబ్ నిర్మాణం అటకెక్కినట్లేనా?

కరీంనగర్ హబ్ నిర్మాణం అటకెక్కినట్లేనా?

రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలన్నీ భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్లాయి. కాగా అన్నిరకాల అడ్డంకులన్నీ తొలగిపోయి ఖమ్మంలో నిర్మించనున్న ఐటీ హబ్‌కు కార్యాచరణ మొదలవ్వడంతో ఇబ్బందుల్లేవు. కానీ రాజకీయంగా తన కెరీర్ ఎదుగుదలకు కారణమైన కరీంనగర్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు సంగతి మంత్రి కే తారక రామారావు విస్మరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో ఏర్పాటు కానున్న ఐటీ హబ్ రెండోది. ఇంతకుముందు వరంగల్‌లో ఐటీ హబ్ ఏర్పాటైంది.

ఐటీ హబ్‌తో కొత్త వెలుగులు

ఐటీ హబ్‌తో కొత్త వెలుగులు

ఖమ్మంలో కొత్త చరిత్ర పురుడు పోసుకోబోతున్నది. దాదాపు 2వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సామర్థ్యం కలిగిన ఈ హబ్‌ను నాలుగు అంతస్తుల అధునాతన భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఐటీహబ్ ఏర్పాటుకు సంబంధించి మొదటి విడుత పనులు పూర్తయిన వెంటనే మరో రూ.12.50 కోట్ల నిధులు కూడా మంజూరు కానున్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఖమ్మంలో ఐటీహబ్‌ ఏర్పాటు చేస్తున్నది. దాదాపు 15 అమెరికన్ ఐటీ కంపెనీలు ఖమ్మంలో తమ వ్యాపార లావాదేవీల నిర్వహణకు అంగీకారం తెలుపటం గమనార్హం.

English summary
TS IT Minister Kalwakuntla Taraka Ramarao had laid foundation stone for Khammam IT Hub recently. But Last year IT Minister K T Ramarao as assured to established IT Hub. CM KCR also assured to established Medical College and Horticulture university but these are shifted now Siddipet District fo united Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X