వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసీఆర్‌! ఉద్యమంలో నువ్వెక్కడ?, నీకు మోడీ భయం, రేపు లెక్క చెప్తాం'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీజేపీపై, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాపై, తనపై విమర్శలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి బుధవారం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌పై ఆయన ఊగిపోయారు.

<strong>అమిత్ షా వ్యూహం: కెసిఆర్ పై 'నిజాం ' అస్త్రం</strong>అమిత్ షా వ్యూహం: కెసిఆర్ పై 'నిజాం ' అస్త్రం

ఢిల్లీలో ఉన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కాదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెరాస ఎంతగా పోటీ చేసిందో అంతకు పదిరెట్లు మేం పోరాడామన్నారు.

ఊగిపోయిన కిషన్ రెడ్డి

ఊగిపోయిన కిషన్ రెడ్డి

ఉద్యమం కోసం రాజీనామా కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిలియన్ మార్చ్‌లో, ఢిల్లీలో ఆందోళనలో, రైల్ రోకోలో కేసీఆర్ ఎక్కడున్నారో నిలదీశారు. కేసీఆర్ ప్రతి ప్రశ్నకు తాము రేపు సమాధానం చెబుతామన్నారు.

కేసీఆర్‌కు మోడీ భయం పట్టుకుందని, దళితుడిని ముఖ్యమంత్రిగా చేయనందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని కిషన్్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్బర్, అసద్‌లను భుజాలపై వేసుకొని కేసీఆర్ ఊరేగుతున్నారన్నారు. దళితుడిని సీఎం చేయనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.

మెచ్చుకోలుపై..

మెచ్చుకోలుపై..

పలు సభల్లో, సమావేశాల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకొని ఉండవచ్చునని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెడతానని చెప్పే మంచిపనులను కేంద్రం, కేంద్రమంత్రులు ప్రశంసిస్తారని చెప్పారు.

అమలుపై మేం ప్రశ్నిస్తాం

అమలుపై మేం ప్రశ్నిస్తాం

కానీ వాటిని అమలు చేయకపోవడాన్ని తాము నిలదీస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. పథకాలు అమలుపరుస్తామంటే ఎవరైనా ప్రశంసిస్తారని, కానీ వాటిని అమలు చేయడంలో కెసీఆర్ ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీపై..

తెలుగుదేశం పార్టీపై..

ఏపీలో అయినా, తెలంగాణలో అయినా తమకు తెలుగుదేశం పార్టీ ఏమీ ప్రత్యర్థి కాదని చెప్పారు. ఆ పార్టీని తాము మిత్రపక్షంగానే భావిస్తున్నామని చెప్పారు. కానీ సమస్యలపై పోరాడటంలో ఆయా పార్టీల వైఖరి వారికి ఉంటుందని చెప్పారు. ఎవరి పార్టీ ఎత్తుగడ వారికి ఉంటుందన్నారు.

ఎవరితోనైనా కలిసి పని చేస్తాం

ఎవరితోనైనా కలిసి పని చేస్తాం

సమస్యల దృష్ట్యా తాము అవసరమైతే కమ్యూనిస్టుల కలిసి పోరాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కలిసి పని చేశామన్నారు. ధర్నా చౌక్ కోసం కాంగ్రెస్, టిడిపి, లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేశామని కిషన్ రెడ్డి అన్నారు.

English summary
BJP LP Kishan Reddy counter to TRS leader over allegations on BJP and Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X