వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం చెప్పింది తప్పితే..: కోదండరాం, అక్కడ నో చెప్పిన పోలీసులు

ఈ నెల 22వ తేదీన నిరుద్యోగ ర్యాలీకు అనుమతి వస్తుందని తాము భావిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన నిరుద్యోగ ర్యాలీకు అనుమతి వస్తుందని తాము భావిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సోమవారం అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పైన తప్ప అన్నింటి మీదా స్పందిస్తోందని కేసీఆర్ గవర్నమెంటును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

నిరుద్యోగ ర్యాలీకి రాకుండా ముందస్తుగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ విజయవంతానికి 15 సబ్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

<strong>అల్లకల్లోలం: పన్నీరుపై విజయశాంతి సంచలనం, శశికళకు మద్దతు</strong>అల్లకల్లోలం: పన్నీరుపై విజయశాంతి సంచలనం, శశికళకు మద్దతు

ర్యాలీలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసే అవకాశముందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ర్యాలీకి ఎన్నారైల మద్దతు ఉందని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 7వేల ఖాలీలు ఉన్నాయని చెప్పారు. రానున్న రెండేళ్లలో మరో 30వేల ఖాళీలు ఏర్పడతాయన్నారు.

Kodandaram demands permission for Nirudyoga Rally

నిరుద్యోగ ర్యాలీలో అన్ని విద్యార్థి సంఘాలు, పార్టీలు పాల్గొంటాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే పోటీ పరీక్షల క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఫుల్ ఫిల్ చేయాలన్నారు. ఎస్వీకే నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ ఉంటుందని చెప్పారు.

అనుమతి లేదన్న పోలీసులు

ఈ నెల 22న ఐకాస ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ నిరసన ర్యాలీని ఎట్టిపరిస్థితుల్లోనైనా చేపట్టితీరుతామని ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఐకాస నేతలను పోలీసులు కలిశారు.

ర్యాలీని ఇందిరా పార్కు వద్ద కాకుండా ప్రత్యామ్నాయ వేదికలు సూచించారు. శంషాబాద్‌లోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ మైదానం, నాగోల్‌ మెట్రో రైల్‌ వద్ద మైదానం, చేర్యాల గ్రామంలోని మైదానం, గండిపేటలోని వాలంతరి మైదానాలతో పాటు మియాపూర్‌ వద్ద మైదానం, అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద మైదానాల్లో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. వారి సూచనలపై స్పందించిన నేతలు చర్చించి చెబుతామన్నారు.

నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వాలని కోదండ పిటిషన్

నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ జేఏసీ చైర్మన్ కోదండరాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పోలీసు శాఖ హైకోర్టులో వాదనలు వినిపించింది. జల్లికట్టు తరహా ఉద్యమం కావాలని జేఏసీ చెబుతోందని, ఇప్పటికే జేఏసీ పైన 31 కేసులు ఉన్నాయని చెప్పింది. అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది.

అబద్దాలు చెప్పడంలో దిట్ట: దిగ్విజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలు అబద్దాలు చెప్పడంలో దిట్ట అని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మోడీకి అబద్దాలు చెప్పడంలో గోల్డ్ మెడల్ ఇవ్వవచ్చునన్నారు. గతంలో ఆధార్ కార్డులను మోడీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇలాంటి అబద్దాలు చెప్పే నాయకుడిని చూడలేదన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram on Monday demanded to permission for Nirudhyoga Rally on February 22nd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X