హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదండ విడుదల, డోర్లు పగులగొట్టి తీసుకెళ్లారని భార్య: కుట్ర.. నాయిని సంచలనం

తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాంను పోలీసులు విడుదల చేశారు. నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునిచ్చిన ఆయనను బుధవారం ఉదయం వేకువజామున మూడు గంటలకు ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాంను పోలీసులు విడుదల చేశారు. నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునిచ్చిన ఆయనను బుధవారం ఉదయం వేకువజామున మూడు గంటలకు ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కమిషనరేట్‌కు కోదండ సతీమణి, 'కేసీఆర్ అప్పుడు సీఎం అయి ఉంటే..'కమిషనరేట్‌కు కోదండ సతీమణి, 'కేసీఆర్ అప్పుడు సీఎం అయి ఉంటే..'

జేఏసీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు, జేఏసీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం కోదండరామ్‌ను కామాటిపురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి ఏడు గంటల సమయంలో స్టేషన్‌ నుంచి పోలీసులు విడుదల చేశారు.

ఇంటికి వెళ్తున్న సమయంలో కోదండ మాట్లాడారు. ర్యాలీని విజయవంతం చేసిన అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తన‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన తీరు అభ్యంతరకరమన్నారు. జేఏసీతో భేటీ అయి త‌మ‌ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

kodandaram

మా ఇంటి తలుపులు పగులగొట్టి తీసుకెళ్లారు

తన భర్త కోదండరాం అరెస్టు పాశవిక చర్య అని ఆయన సతీమణి సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోను పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించలేదన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. అర్ధరాత్రి పూట తమ ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారన్నారు.

కోదండరాం ముందస్తు అరెస్టు, విద్యార్థులు, కార్యకర్తలను కూడా: ర్యాలీపై ఉత్కంఠకోదండరాం ముందస్తు అరెస్టు, విద్యార్థులు, కార్యకర్తలను కూడా: ర్యాలీపై ఉత్కంఠ

కోదండపై నాయిని సంచలన వ్యాఖ్యలు

కోదండరాం పైన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కోదండ కుట్ర చేశారని ఆరోపించారు. ఆయన కొత్త పార్టీ పెట్టినా తమకు వచ్చిన నష్టం లేదన్నారు.

కోదండరాం సహా అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ‌ వేదికగా ప్రకటించారని, ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

సొంత పాలనలో.. ఓయులో ఆత్మహత్యాయత్నం, కోదండ అరెస్ట్‌పై హెచ్చార్సీకిసొంత పాలనలో.. ఓయులో ఆత్మహత్యాయత్నం, కోదండ అరెస్ట్‌పై హెచ్చార్సీకి

తెలంగాణ వారే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లిన వ్యక్తి... హైకోర్టు చెప్పినట్లు మరో ప్రదేశంలోనో... ఆదివారమో ఎందుకు సభ నిర్వహించుకోరని అడిగారు.

అన్నీ తాను చెప్పినట్లే జరగాలని కోదండరాం అనుకుంటే ఎలాగన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పై కాంగ్రెస్, టిడిపి నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. మిలియన్ మార్చ్, సాగరహారాలు స్వాతంత్ర పోరాటాలని వాటితో ఈ ఆందోళనలను పోల్చడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్చ ఉందని, కోదండరాం పార్టీ పెట్టినా తమకు నష్టం లేదన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram released from jail on Wednesday evening. Kodanda wife lashed out at KCR government for arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X