వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిషనరేట్‌కు కోదండ సతీమణి, 'కేసీఆర్ అప్పుడు సీఎం అయి ఉంటే..'

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సతీమణి బుధవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆమె సీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. తన భర్త అరెస్టు పైన సీపీకీ ఫిర్యాదు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సతీమణి బుధవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆమె సీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. తన భర్త అరెస్టు పైన సీపీకీ ఫిర్యాదు చేశారు.

<strong>సొంత పాలనలో.. ఓయులో ఆత్మహత్యాయత్నం, కోదండ అరెస్ట్‌పై హెచ్చార్సీకి</strong>సొంత పాలనలో.. ఓయులో ఆత్మహత్యాయత్నం, కోదండ అరెస్ట్‌పై హెచ్చార్సీకి

కేసీఆర్ సీఎం అయి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు

ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కోదండరాం పైన తీవ్రవాది, హింసావాది అని ముద్రవేయడం ఏమాత్రం సరికాదన్నారు.

 Kodandaram's wife complaint to CP

కేసీఆర్ పాలన హిట్లర్, ముస్సోలినిని తలపిస్తోందన్నారు. వెంటనే ఆయన విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కోదండరాంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.

<strong>'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'</strong>'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'

జానారెడ్డి ఖండన

నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి ప్రజాస్వామ్యబద్ధంగా రక్షణ కల్పించకుండా
ప్రజాసంఘాలను అవమానించడమేనని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి అన్నారు.

నిరుద్యోగులకు అండగా ఉంటూ ర్యాలీ నిర్వహించిన జేఏసీ చైర్మన్ కోదండరాంను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు. వెంటనే కోదండరాంని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Telangana JAC chairman Kodandaram's wife came to City Police Commissionerate on Wednesday for arresting husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X