వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ స్టర్ నయీం డైరీలోని పేర్లు చెప్పాలి: కోదండరాం, కేసీఆర్‌కు ప్రశంస

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం డైరీలోని పేర్లను బయటపెట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మంగళవారం నాడు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మంచిదే కానీ వివరాలు బయటపెట్టాలన్నారు.

జల వివాదాలు సాగదీయడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాల ఏర్పాటులో గద్వాల, జనగామ ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోదండరాం హితవు పలికారు.

Kodandaram wants to expose Nayeem diary

ఇవాళ చీకటి రోజు: సబితా రెడ్డి

మహారాష్ట్ర - తెలంగాణ ప్రభుత్వాల ఒప్పందం నేపథ్యంలో ఇవాళ చీకటి రోజు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నయీం అరాచకం: బయటపడ్డ అమ్మాయి అస్తిపంజరం, మాట విన్లేదని..ఈ నేపథ్యంలో సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడారు. మహారాష్ట్రతో ఒప్పందం చీకటి రోజు అన్నారు. ఇది మహాద్రోహం అన్నారు. ప్రభుత్వం మోసాలను వివరించేందుకే తాము నిరసనలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram wants to expose Nayeem diary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X