వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15మిలియన్ డాలర్ల పెట్టుబడులు: చికాగోలో బిజీబిజీగా కెటిఆర్(పొటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా పర్యటనలో తెలంగాణ భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కెటి రామారావు బిజీ బిజీగా గడుపుతున్నారు. చికాగోలు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా డిజిటల్ హెల్త్‌కేర్ కంపెనీ ఎక్లాస్ హెల్త్ సొల్యూషన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు, వెయ్యి ఉద్యోగాల కల్పనకు మరో ఒప్పందం జరిగింది.

KTR in Chicago

ఈ సందర్భంగా తెలంగాణ ఎన్‌ఐఆర్‌లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. చికాగోతో హైదరాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణతో ఇన్నోవేషన్ రంగంలో భాగస్వామ్యానికి ఇల్లినాయిస్ డిప్యూటీ గవర్నర్ ఆసక్తి చూపారు. రాష్ట్రంలో పలు సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని డిప్యూటీ గవర్నర్ తెలిపారు.

పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ఇండియానా పోలీస్‌ హైదరాబాద్‌ సిస్టర్‌ సిటీ కమిటీ భేటీ పాల్గొన్నారు. ఈ భేటీలో ఇండియానా పోలీస్‌లో సాంస్కృతిక, వ్యాపార సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను కేటీఆర్‌ అక్కడి వారికి వివరించారు.

English summary
Minister KTR has reached Chicago, as part of his tour in America, to attract investments for Telangana State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X