హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. వైఫై సేవలను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నూతన టికెట్ బుకింగ్ కౌంటర్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె.శ్రీవాత్సవ పాల్గొన్నారు. తొలి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వేలోనే మొట్టమొదటి సారిగా సికింద్రాబాద్‌లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయని కెటిఆర్ చెప్పారు. దేశంలో 13 లక్షల ఉద్యోగులు కలిగిన సంస్థ రైల్వే అని చెబుతూ ఈ ఏడాది చివరి వరకు హైదరాబాద్ లో పూర్తిగా వైఫై సేవలు అందిస్తామని ప్రకటించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. వైఫై సేవలను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

ఈ కార్యక్రమంలో భాగంగా నూతన టికెట్ బుకింగ్ కౌంటర్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె.శ్రీవాత్సవ పాల్గొన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

తొలి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలోనే మొట్టమొదటి సారిగా సికింద్రాబాద్ లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయని కెటిఆర్ చెప్పారు.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

దేశంలో 13 లక్షల ఉద్యోగులు కలిగిన సంస్థ రైల్వే అని చెబుతూ ఈ ఏడాది చివరి వరకు హైదరాబాద్ లో పూర్తిగా వైఫై సేవలు అందిస్తామని ప్రకటించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

మొదటి దశలో భాగంగా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, విజయవాడ స్టేషన్లలో వైఫై సేవలను ప్రారంభించారు. ఇందుకుగాను రూ.50 లక్షల వ్యయంతో గిగాబైట్‌ ఈథర్నె ట్‌ స్విచ్‌లను ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల వద్ద కూడా వైఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు వెల్లడించాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వైఫై సేవలను అందుకునేందుకుగాను ప్రయాణికులు మొబైల్‌ ఫోన్లలోని వైఫై ఆప్షన్‌కు వెళ్ళి, ‘రైల్వే ఎంటీఎస్‌ వైఫై'కు కనెక్ట్‌ కావాలి. ఇప్పటివరకు దేశం మొత్తంమీద న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు రైల్వేస్టేషన్లలో మాత్రమే వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై

ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌ మీదుగా వెళ్ళే వివిధ ఎక్స్‌ప్రెస్‌, ప్రీమియర్‌ రైళ్ళలోనూ వైఫై సేవలను అందుకోవచ్చు. మొత్తం మూడు దశల్లో 74 రైల్వే స్టేషన్లలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వైఫై ప్రవేశపెట్టే దిశ గా దక్షిణమధ్య రైల్వే యంత్రాంగం అడుగులు వేస్తోంది.

English summary
Union Minister for Labour & Employment Bandaru Dattatreya and Telangana IT Minister K. Taraka Ramarao on Tuesday launched free WIFI services at Secunderabad Railway Station. A new ticket booking counter was also opened on the occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X