వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానారెడ్డి జానెడంత కూడా: కెటిఆర్, 'మోడీని కెసిఆర్ కలిస్తే 8వేలకోట్లు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి పైన విరుచుకు పడ్డారు.

మెదక్ జిల్లాలోని కల్హేర్‌లో ఆదివారం స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇటీవల శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై జరిగిన చర్చ తాము ఆశించిన దానికి భిన్నంగా జరిగిందన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయలేదన్నారు. జానారెడ్డి జానెడంత మంచి కూడా చెప్పలేదన్నారు.

KTR hot comment on Jana Reddy

రైతులకు రూ.లక్ష వరక రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్నదాతలను ఆదుకుంటామన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రతిపక్షాలు వాళ్లు తాము వదిలి వెళ్లిన అరవై ఏళ్ల దరిద్రాన్ని పదిహేను నెలల్లోనే పోగొట్టాలనే రీతిలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చుతూ ముందుకు పోతోందన్నారు.

రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంటింటికి మంచినీటిని అందించడం సీఎం కేసీఆర్ కల అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామన్నారు.

కెసిఆర్ ప్రధానిని కలిస్తే రూ.8వేల కోట్లు వచ్చే అవకాశం: దత్తాత్రేయ

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి కలిస్తే రూ.8 వేల కోట్లు సమకూరే అవకాశం ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనలో సహజ ప్రమాణాలు పాటించాలని సూచించారు.

చిన్న తరహా పరిశ్రమల సవరణ చట్టం-2015ను తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధికి అడ్డుగోడగా తయారైందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతోన్న ప్రతీ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి అడ్డుతగులుతోందన్నారు.

English summary
Telangana Minister KT Rama Rao on Sunday make hot comment on CLP leader Jana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X