వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘డబుల్‌బెడ్ రూం’లో టాటా భాగస్వామ్యం: సీఎం కెసిఆర్‌పై మిస్త్రీ, అంబానీ ప్రశంసలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తీ ఆసక్తి చూపించారు. ఐటి మంత్రి కె తారక రామామారావు సోమవారం ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్ర్తీని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలను కలిసి తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించారు.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకుగల అవకాశాలను వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. టాటా గ్రూపు ఇప్పటికే నగరంలో డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్టు కెటిఆర్ తెలిపారు.

తెలంగాణకు టాటా బ్రాండ్ అంబాసిడర్స్ అని సీఎం గతంలో అన్న మాటలను కెటిఆర్ మిస్ర్తికి గుర్తు చేశారు. ఐటి పరిశ్రమ, పారిశ్రామికరంగంతో పాటు హౌసింగ్ రంగంలో పెట్టుబడులపై మిస్ర్తితో కెటిఆర్ చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకంలో భాగస్వామ్యానికి టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి అంగీకారం తెలిపారు. టాటా హౌసింగ్ ప్రాజెక్టు తరఫున కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటామని సైరస్ మంత్రి కెటిఆర్‌కు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో టాటా-ఏఐజి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు మిస్ర్తి తెలిపారు. ఇక టి-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌కు సహకారం అందించేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. అనంతరం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కెటిఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, విద్యుత్ ప్రణాళికలను మంత్రి అంబానీకి వివరించారు.

ప్రతి పథకానికి ఒక డెడ్‌లైన్ విధించి ముందుకెళ్తున్నట్టు చెప్పారు. వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగేది లేదని సిఎం చేసిన ప్రకటనను గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పక్కా విజన్‌తో ముందుకెళ్తోందని, దానికి తగిన ఆచరణ కనిపిస్తోందని అంబానీ అన్నారు. కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు, ఆచరణను అంబానీ అభినందించారు. ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తమవద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో పెద్దఎత్తున వివిధ రంగాల్లో కలిసి పని చేస్తామన్నారు. ముంబై పర్యటనలో కెటిఆర్ వెంట తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.

సైరస్ మిస్త్రీ కెటిఆర్

సైరస్ మిస్త్రీ కెటిఆర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తీ ఆసక్తి చూపించారు.

ముకేష్ అంబానీతో కెటిఆర్

ముకేష్ అంబానీతో కెటిఆర్

ఐటి మంత్రి కె తారక రామామారావు సోమవారం ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్ర్తీని, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీలను కలిసి తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించారు.

ముకేష్ అంబానీతో కెటిఆర్

ముకేష్ అంబానీతో కెటిఆర్

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకుగల అవకాశాలను వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించారు.

మిస్త్రీతో కెటిఆర్

మిస్త్రీతో కెటిఆర్


టాటా గ్రూపు ఇప్పటికే నగరంలో డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్టు కెటిఆర్ తెలిపారు.

English summary
Telangana Minister KT Rama Rao on Monday met TATA Chairman Cyrus Mistry and RIl Chairman Mukesh in Mumbai.mbani
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X