హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ కేంద్రంగా దూసుకెళ్తోంది: కేటీఆర్, సైనికులకూ ‘డబుల్’ అన్న కేసీఆర్

దేశంలో ఎక్కడా లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
దేశ భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న సైనిక కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సైనికుల సంక్షేమంపై శాసనసభలో మంగళవారం ఆయన ప్రకటన చేశారు.

సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని.. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సైనికుల సంక్షేమ నిధికి డబ్బులు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

సైనికుల సంక్షేమాన్ని సామాజిక భద్రతగా గుర్తించాలన్నారు. సైనికులు, మాజీ సైనికుల కుటుంబాల మెరుగైన జీవితం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. వారి పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకంలో రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో సైనిక పాఠశాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని.. దానిని వరంగల్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీరచక్ర, శౌర్యచక్ర అవార్డులు పొందిన సైనికులకు రూ.75లక్షలు, సేవా మెడల్‌ పొందిన వారికి రూ.30లక్షలు, సర్వోత్తమ అవార్డు పొందినవారికి రూ.25లక్షల నగదు పురస్కారం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

KTR on Hyderabad develpoment

దూసుకెళ్తోంది, ఐటీ కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్

అభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ దూసుకెళ్తొందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై శాసనసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు కృషి చేస్తామన్నారు.

భాగ్యనగరాన్ని ఐటీకి కేంద్రం మార్చామని.. పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. 2017లో నగరంలో ప్రతిరోజు నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని... 2018 నాటికి శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తామని తెలిపారు.

చెత్త సేకరణకు 2 వేల ఆటో టిప్పర్లను ఏర్పాటు చేసి 48 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశామన్నారు. శివారు ప్రాంతాలకు తాగునీటి పైప్‌లైన్లు వేస్తామని చెప్పారు. నాలాలపై అక్రమ కట్టడాలు గుర్తించి కూల్చేస్తున్నామని, 180 కోట్లతో దుర్గం చెరువుపై వంతెన నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

బీటీ రోడ్లలో ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని వినియోగిస్తున్నామని, 2500 కోట్లతో ఐదు రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. మూడు రేడియల్‌ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, మరో 1000 కోట్లతో మరో రెండు రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపడతామని వివరించారు.

మూసీ పొడవునా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూకట్‌పల్లి నాలా నీటి మళ్లింపునకు 54 కోట్లు కేటాయించామన్నారు. ఉప్పల్ బగాయత్‌ భూముల సమస్యను పరిష్కరించామని తెలియజేశారు. కోర్టు కేసులున్న భవనాలకు ఆస్తి పన్ను విధిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే మొదటి దశను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగర పరిధిలోని అన్ని శివారు ప్రాంతాలకు 2018నాటికి మంచినీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడానికి రూ.625కోట్ల రుణ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.

English summary
Telangana Minister KT Rama Rao on Tuesday responded on Hyderabad develpoment issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X