వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి కేసీఆర్‌పై లగడపాటి, అప్పుడే ఎంపీగా గెలిచానని వ్యాఖ్య..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు.

lagadapati rajagopal

యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకంటున్నానని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారపోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు.

గతంలో తాను యాదాద్రిని దర్శించుకున్న తర్వాతే ఎంపీగా గెలిచానని చెప్పారు. అయితే, ఇప్పుడు రాజకీయాల్లోకి తిరిగి రావడంపై ఆయన స్పందించలేదు. కాగా, లగడపాటి యాదాద్రిలో పర్యటించారు. ఆయనతో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఉన్నారు.

కాగా, గతంలో గోదావరి పుష్కరాల సమయంలోను కేసీఆర్ పైన లగడపాటి ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా, గతంలో యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నాకే ఎంపీగా గెలిచానని లగడపాటి చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

English summary
Former Lagadapati Rajagopal has praised CM KCR again for Yadadri development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X