వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు

హెడ్‌కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా జడ్జి డాక్టర్ జి రాధారాణి సోమవారం తీర్పు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

నల్గొండ: హెడ్‌కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా జడ్జి డాక్టర్ జి రాధారాణి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే.. నల్గొండ మండలం అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో 2010 నవంబర్ 7వ తేదీ సాయంత్రం విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సిహెచ్‌జివి నారాయణపై అదే బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మొదాల వీరయ్య తన తుపాకీతో కాల్పులు జరిపాడు.

దీంతో నారాయణకు నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయ. వెంటనే అతడ్ని నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ ఆర్.కేశవులు.. నల్గొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి రూరల్ సిఐలు ఈ.రవీందర్, కె.పాండురంగారెడ్డి విచారణ జరిపారు.

Life sentence to a constable for murdering head constable.

మొదాల వీరయ్య, నారాయణ 12వ బెటాలియన్‌లో ఉద్యోగం చేస్తూ బెటాలియన్‌లోనే నివసిస్త్తున్నారని, వీరయ్య భార్యతో నారాయణకు అక్రమ సం బంధం ఉందన్న అనుమానంతోనే నారాయణను అంతం చేసినట్లు పోలీసులు తమ తుది నివేదిక సమర్పించారు.

వాదప్రతివాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పునిస్తూ.. వీరయ్యకు హత్యానేరం, ఆయుధాల చట్టం ప్రకారం జీవితఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అయితే ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని ఆమె ఆ తీర్పులో వెల్లడించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున పిపి ఎం మారుతీరావు కులకర్ణి వాదించగా లైజన్ అధికారి భీమ్‌రెడ్డి సహకరించారు.

English summary
Life sentence to a constable for murdering head constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X