హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్ చిన్నారికి చూపునిచ్చిన ఎల్వీప్రసాద్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పొరుగుదేశం పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి వచ్చిన మూడున్నరేళ్ల చిన్నారికి నగరంలోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ వైద్యులు రెటినోబ్లాస్టోమా చికిత్స చేసి చూపు పోకుండా కాపాడారు. బుధవారం వైద్యులు, చిన్నారి తల్లి మీడియాతో వివరాలు వెల్లడించారు. లాహోర్‌కు చెందిన ఫాతిమాకు పుట్టుకతోనే మెల్లకన్ను ఉంది.

ఆమె పెరుగుతున్న కొద్ది కంటి చూపు మందగిస్తుందని తల్లిదండ్రులు గుర్తించారు. వైద్యులకు చూపిస్తే బాలికకు కంటి క్యాన్సర్ ఉందని తెలిసింది. దీంతో ఉత్తమ నేత్రవైద్యం కోసం ఆన్‌లైన్‌లో వెతికి చివరకు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థకు వచ్చారు. ఇలా పలు దఫాలుగా లాహోర్ నుంచి ఇక్కడికి వచ్చి చిన్నారికి చికిత్స చేయించారు. ఇప్పుడు చిన్నారి కోలుకుందని వైద్యులు తెలిపారు.

పుట్టుకతోనే చిన్నారుల్లో వచ్చే కంటి సంబంధిత క్యాన్సర్ రెటినో బ్లాస్టోమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆక్యులర్ అంకాలజిస్ట్ డా.స్వాతి కలికి అన్నారు. మే 10 నుంచి 16 దాకా నిర్వహించనున్న రెటినోబ్లాస్టోమా అవగాహన వారోత్సవాల గురించి ఆమె మీడియాకు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8వేలకు పైగా కొత్త రెటినో బ్లాస్టోమా కేసులు నమోదవుతున్నాయని, వాటిలో 1000 కేసులు మన దేశంలోనే నమోదవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే చికిత్స సులభమవుతుందన్నారు. రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్వీ ప్రసాద్ విజ్ఞాన సంస్థలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ నెలకొల్పామన్నారు.

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

పొరుగుదేశం పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి వచ్చిన మూడున్నరేళ్ల చిన్నారికి నగరంలోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ వైద్యులు రెటినోబ్లాస్టోమా చికిత్స చేసి చూపు పోకుండా కాపాడారు.

కంటిచూపు పొందిన పాక్ చిన్నారి

కంటిచూపు పొందిన పాక్ చిన్నారి

బుధవారం వైద్యులు, చిన్నారి తల్లి మీడియాతో వివరాలు వెల్లడించారు. లాహోర్‌కు చెందిన ఫాతిమాకు పుట్టుకతోనే మెల్లకన్ను ఉంది.

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

ఆమె పెరుగుతున్న కొద్ది కంటి చూపు మందగిస్తుందని తల్లిదండ్రులు గుర్తించారు.

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

వైద్యులకు చూపిస్తే బాలికకు కంటి క్యాన్సర్ ఉందని తెలిసింది. దీంతో ఉత్తమ నేత్రవైద్యం కోసం ఆన్‌లైన్‌లో వెతికి చివరకు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థకు వచ్చారు.

చిన్నారితో తల్లిదండ్రులు

చిన్నారితో తల్లిదండ్రులు

ఇలా పలు దఫాలుగా లాహోర్ నుంచి ఇక్కడికి వచ్చి చిన్నారికి చికిత్స చేయించారు. ఇప్పుడు చిన్నారి కోలుకుందని వైద్యులు తెలిపారు.

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి

పుట్టుకతోనే చిన్నారుల్లో వచ్చే కంటి సంబంధిత క్యాన్సర్ రెటినో బ్లాస్టోమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆక్యులర్ అంకాలజిస్ట్ డా.స్వాతి కలికి అన్నారు.

రెటినో బ్లాస్టోమా జబ్బుతో బాధపడుతూ ఎల్వీ ప్రసాద్‌లో చికిత్స పొంది పూర్తి స్వస్థత పొందిన పాకిస్థాన్‌కు చెందిన మూడున్నర ఏళ్ల వయసు గల బేబీ ఫాతిమా, కోల్‌కతాకు చెందిన రోనక్, వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో డా.విజయ్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.

English summary
A child from Pakistan, who was suffering from retinoblastoma, was successfully treated by doctors at the LV Prasad Eye institute here in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X