వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడి నుంచి కుట్ర, ఎవరున్నారో తెలుసు: హరీష్ హెచ్చరిక, ఏపీపై..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని, కొందరు హైదరాబాద్ నుంచి బయలుదేరి కుట్ర చేస్తున్నారని, దీని వెనుక ఎవరు ఉన్నారో అన్నీ తెలుసుకుంటున్నామని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని మంత్రి హరీష్ రావు సోమవారం హెచ్చరించారు.

ప్రజల సమ్మతితోనే భూసేకరణ జరుపుతున్నారమని చెప్పారు. ఎవరి పైనా తాము ఒత్తిడి చేయడం లేదన్నారు. మల్లన్న సాగర్ బాధితులతో తాము చర్చిస్తున్నామని చెప్పారు. వారికి ప్రాజెక్టులు కావాలా, పంచాయతీలు కావాలా అని ప్రశ్నించారు.

పోలీసుల కళ్లుగప్పి, రేవంత్ రెడ్డి వ్యూహం, ఎట్టకేలకు అరెస్ట్ఏదో రకంగా వివాదం చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. దీనిపై కోర్టులకు వెళ్లడం, ఢిల్లీలో ఫిర్యాదులు చేయడం సరికాదని అన్నారు. రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోవడం లేదన్నారు. విపక్షాల బంద్ విఫలమైందని అన్నారు.

ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రతి దానిని విపక్షాలు వివాదం చేస్తున్నాయన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం సరికాదని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇస్తామన్నారు.

ఎనిమిది గ్రామాల్లో ఆరు గ్రామాలు భూసేకరణకు అంగీకరించాయన్నారు. రిజర్వాయర్లన్నీ నీళ్లు ఉంటేనే కట్టారా అని హరీష్ రావు నిలదీశారు. తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వాలనుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంటును అడ్డుపెట్టుకొని రెచ్చగొడుతున్నారన్నారు.

హర్యానా, తెలంగాణ ప్రాజెక్టులకు పోలీక లేదన్నారు. రైతులు కోరిన విధంగా భూ సేకరణ చేపడతామన్నారు. ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. మల్లన్న సాగర్ ఆపాలని ఏ టెంటు కింద విపక్షాలు నిరసన తెలిపారో, ఇప్పుడు అదే టెంటు కింద రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని చెప్పారు.

విపక్షాల ఈ రోజు (సోమవారం) బందుకు పిలుపునిచ్చాయని, కానీ వారి బందుకు ప్రజల మద్దతు లేదన్నారు. హైదరాబాద్ నుంచి, సంగారెడ్డి నుంచో వెళ్లిన టిడిపి, సిపిఎం నేతలు రెచ్చగొట్టి మల్లన్న సాగర్ పరిస్థితిని ఉద్రిక్తం చేశారన్నారు.

కేసీఆర్‌కు 'మల్లన్న' షాక్: ప్రజలపై లాఠీ, అమరావతిని లాగిన హరీష్ఎనిమిది గ్రామాల్లో ఆరు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిందని, ఇప్పుడు ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న గ్రామాల్లోను త్వరలో పూర్తవుతుందని, అది జరగవద్దనే పథకం ప్రకారం, కుట్ర ప్రకారం మిగతా ప్రాంతాల నుంచి వెళ్లి రెచ్చగొట్టారన్నారు. తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం అన్నారు.

మరికొందరు ఈ మధ్యన అంత పెద్ద రిజర్వాయర్ అవసరమా అని ప్రశ్నించారని ఇది విడ్డూరమన్నారు. కృష్ణా నది మీద హక్కు తెలంగాణది అని, కానీ రిజర్వాయర్ మాత్రం రాయలసీమలో కట్టారన్నారు.

ఈ రిజర్వాయర్లు నదుల మీదనే కట్టారా అని ప్రశ్నించారు. హక్కులేని ఏపీ రిజర్వాయర్లు కట్టవచ్చు, హక్కున్న మేం కట్టవద్దా అని ప్రశ్నించారు. మూడో పంట కోసం ఏపీ ఖమ్మం జిల్లాను ముంచవచ్చు, నల్లగొండను ముంచవచ్చు, కానీ మల్లన్న సాగర్‌తో తెలంగాణ రైతులు రెండో పంట పండించుకోవద్దా అని ప్రశ్నించారు.

హరీష్ రావు

హరీష్ రావు

నిన్న (లాఠీచార్జ్, కాల్పులు) జరిగిన ఘటన వెనుక టీడీపీ, సీపీఎం కార్యకర్తల హస్తం ఉందని, ఆ వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని హరీష్ రావు చెప్పారు.

 హరీష్ రావు

హరీష్ రావు

ప్రాజెక్టులు కట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

హరీష్ రావు

హరీష్ రావు

మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు కోరిన విధంగా జీవో 123 లేదా 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపడుతామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

 మల్లన్న సాగర్ ఇష్యూపై ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఇష్యూపై ఉద్రిక్తం

కాగా, ఆదివారం నాడు మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. రెండు గ్రామాల ప్రజల పైన పోలీసులు లాఠీచార్జ్, ప్రతిగా ప్రజలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు.

English summary
Minister Harish Rao counter to Telangana Telugudesam Party and CPM leaders on Mallanna Sagar project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X