హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెల్లి పిలుస్తోందని చెప్పి రేప్, పెళ్లి చేసి ఆమెపై.., వీడియోతో బెదిరింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ఓ రేపిస్ట్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ చేసిన పలు దుర్మార్గాలకు పోలీసులు కూడా అవాక్కయ్యారు. జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక సదరు ఆటో డ్రైవర్ ఇంటి ముందు నుంచి వెళ్తుంది.

ఓ రోజు, తన చెల్లి పిలుస్తోందని ఆమెను లోపలికి పిలిచి ఆమె నోటికి ప్లాస్టర్ వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెబితే చంపుతానని బెదిరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది. నిందితుడు స్కూల్ పిల్లలను దింపే ఆటోకు డ్రైవర్‌గా వెళ్లేవాడు.

call

భద్రంగా స్కూల్లో దింపుతాడని తమ పిల్లలను ఆటోలో పంపిస్తుంటే అతను చేసే పనులతో పేరెంట్స్ షాకయ్యారు. అంతేకాదు, మధ్యాహ్నం సమయంలో స్కూల్ లంచ్ బెల్ కొట్టగానే అతని ఆటోలో ఎక్కిన బాలికల దగ్గరకెళ్లి మాట్లాడేందుకు ఇష్టపడేవాడని అంటున్నారు.

అలాగే మాటల్లోకి దింపి తన ఇంటికి తీసుకెళ్లి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలుస్తోంది. తాను చేస్తున్న అకృత్యాన్ని వీడియో తీయడం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించడం చేసేవాడని తెలుస్తోంది.

లేదంటే వీడియోను నెట్‌లో పెడతానని, చంపేస్తానని చెప్పేవాడని తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఓ ప్రేమ జంటకు పెళ్లి చేశాడు. వారికి సాయం చేస్తున్నట్లుగా నటించి.. అమ్మాయి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.

English summary
Man arrested for harassing girls in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X