వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ నడిరోడ్డుపై మొండెం లేని తల

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ వరంగల్: హైదరాబాదులో రోమాంచితమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలపై పడుకోవడంతో తల , మొండం వేరయ్యాయి. మృతుడి శరీరంపై నలుపురంగు పుల్‌షర్టు దానిపై తెలుపు రంగు గీతలు, ట్రాక్‌షూట్‌ ధరించి ఉన్నడని హెడ్‌ కానిస్టేబుల్‌ యాదగిరి తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి శరీర భాగాలను బస్తాలో మూటగట్టి రైల్వే పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి రిక్షాలో తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో గౌలిగూడ శివాజీ బ్రిడ్జి వద్ద రిక్షాలో తరలిస్తున్న మృతుడి తల కింద పడిపోయింది. దీనిని గమనించని రిక్షాపుల్లర్‌ ఉస్మానియాకు చేరుకొని మూట విప్పగా మృతుడి తల కనిపించలేదు. ఆందోళన చెందిన రైల్వే పోలీసులు వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లారు.

Man's head on the Hyderabad road

అయితే రోడ్డుపై తల పడిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. గుర్తు తెలియని వ్యక్తిని చంపి తలను రోడ్డు పై పడేశారని పుకార్లు వ్యాపించాయి. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌కు తల పడి ఉన్న విషయాన్ని సమాచారమందించారు. అప్పటికే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి తలను స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

అదలావుంటే, హన్మకొండలోని సుభాష్‌ నగర్‌కు చెం దిన బస్వరాజు సురేష్‌, సంధ్యారాణి దంపతులు సుమారు 20మంది నుం చి రూ.35లక్షల మేరకు అప్పులు చేసి పరారైనట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. కాలనీలో లాండ్రీషాపు నిర్వ హిస్తూ చిట్టీలు నడిపిన దంపతులు ఎక్కువ వడ్డీ ఇస్తామని లక్షలాది రూ పాయలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. ఇచ్చిన డబ్బులు చెల్లించాలని పలువురు డిమాండ్‌ చేయడంతో ఈ నెల 6న తెల్లవారుజామున ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఇంటికి వచ్చిన వారిపై బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
The head of a man was found on Hyderabad road. meanwhile, couple escaped cheating people at Warangal of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X