మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడో భార్య కోసం ఇంట్లోనే రెండో భార్య హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడో భార్యతో కాపురానికి అడ్డు వస్తుందనే అనుమానంతో ఓ కిరాతకుడు రెండో భార్యను హత్య చేశాడు. రెండో భార్యకు తెలియకుండా మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్యతో కాపురానికి ఎక్కడు అడ్డువస్తుందోనని కర్కశంగా కిరోసిన్‌ పోసి కాల్చేశాడు.

రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తికి చెందిన ఉప్పరి శేఖర్‌ తన రెండో భార్య సునీత (30)ను కిరోసిన్‌ పోసి కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శేఖర్‌ మొదటి భార్య పేరు అంజమ్మ. వారికి నలుగురు సంతానం. పెద్ద కూతురు ప్రభావతి, అంజమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో శేఖర్‌ నాలుగేళ్ల క్రితం కర్ణాటకలోని గుల్బర్గా తాలూకా లింగంపల్లికి చెందిన సునీతను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇటీవలే శేఖర్‌కు పరిగిలో మరో మహిళతో పరిచయం ఏర్పడి మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి బంధానికి సునీత ఎప్పటికైనా అడ్డంకేనని భావించిన శేఖర్‌ వారం క్రితం ఆమెను తీసుకుని సోమన్‌గుర్తికి వెళ్లాడు. గుట్టు చప్పుడు కాకుండా చంపేసి, ఇంట్లోనే దహనం చేశాడు. శనివారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్థులు ఇంట్లోకి వెళ్లి చూశారు. దాంతో కాలిపోయిన సునీత మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Man torches to kill his wife

వోల్వో బస్సులో మంటలు

కరీంనగర్ -2 డిపోకు చెందిన ఆర్టీసీ ఇంద్ర బస్సు హైద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరింది. బస్సు మార్గమధ్యంలో రాజీవ్ రహదారి పై మెదక్ జిల్లా గౌరారం కమాన్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో వెనుక వైపు నుంచి మంటలు లేచాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఖాన్ బస్సును నిలిపివేసి 40మంది ప్రయాణికులను దింపి వేశారు.

ఆయిల్ సిల్ జాముకావడం వల్లే అందులో నుంచి ఆయల్ లీకై మంటలు వ్యాపించాయి. కాగా పక్కనే ఉన్న గౌరారం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

English summary
A person has killed his wife Sunitha in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X