మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెదక్: దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు, మేకలు, గొర్రెల కాపరులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నామని పేర్కొన్నారు.

బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులోని కిసాన్‌సాగర్ చెరువులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతితో కలిసి చెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయతోనే బంగారు తెలంగాణ సాధ్యమని గ్రహించిన ఎస్పీ సుమతి.. సిఎం కెసిఆర్ పిలుపుతో అందరికంటే ముందుగా చెరువును దత్తత తీసుకుని పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వంతో కలిసి రావడం అభినందనీయమని కొనియాడారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

 మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన


రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు, మేకలు, గొర్రెల కాపరులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నామని పేర్కొన్నారు.

 మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులోని కిసాన్‌సాగర్ చెరువులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతితో కలిసి చెరువు పనులను ప్రారంభించారు.

 మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయతోనే బంగారు తెలంగాణ సాధ్యమని గ్రహించిన ఎస్పీ సుమతి.. సిఎం కెసిఆర్ పిలుపుతో అందరికంటే ముందుగా చెరువును దత్తత తీసుకుని పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వంతో కలిసి రావడం అభినందనీయమని కొనియాడారు.

 మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన


పోలీసులు రక్షణలోనే కాదు, సామాజిక సేవలోనూ ముందుంటామని ఎస్పీ రుజువు చేశారన్నారు.

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన


గతంలో పోలీసులే పని చేప్పేవారని, ప్రస్తుతం పనిచేసే పోలీసులని ఎస్పీ చూపించారన్నారు. ఈ విషయంలో డీజీపీని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, ఇతర జిల్లాల్లో కూడా పోలీసు అధికారులు మిషన్‌ కాకతీయలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.

 మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

మిషన్: ఎస్పీ సుమతికి హరీశ్ అభినందన

కిసాన్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

మిషన్‌కాకతీయకు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపి రూ.32.18 కోట్లు విరాళాలు ఇచ్చాయని, ఎన్‌ఆర్‌ఐ, ఇతరుల నుంచి ఇప్పటివరకు రూ.41.16 కోట్లు విరాళంగా అందాయని తెలిపారు. చెరువులు, కుంటల కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 25 శాతం వరకు పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఎస్పీ సుమతి మాట్లాడుతూ.. చెరువును దత్తత తీసుకుని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

English summary
Telangana Minister Harish Rao on Wednesday Inaugurated Lake Restoration Works at Medak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X