వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ప్రగతిశీల రైతు: అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవంలో కెటిఆర్(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా ఒక ప్రగతిశీల రైతు అని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు అన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ రెండేళ్లలో ఎన్నో కొత్త పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారని చెప్పారు. గతంలో ఏనాడూ లేనివిధంగా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారని అన్నారు.

రుణమాఫీ సహా అన్ని అంశాల్లో రైతులకు దన్నుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కెటి రామారావు, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ బర్గ్‌లెన్సన్‌తో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రి ఫ్యాబ్లెట్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రైతాంగానికి మేలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెటిఆర్ అన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకే ఇక్రిశాట్‌లో కలిసి అగ్రిఫ్యాబ్లెట్‌ను తీసుకువచ్చినట్టు చెప్పారు. ఇక్రిశాట్‌వంటి అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో ఉండటం తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణమన్నారు.

వ్యవసాయరంగంలో పరస్పర సహకారం అందించుకోవడంపై వ్యవసాయ, ఐటీ శాఖలు, ఇక్రిశాట్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంత్రుల సమక్షంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ బర్గ్‌లెన్సన్‌లు ఎంఓయూపై సంతకాలు చేశారు.

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా ఒక ప్రగతిశీల రైతు అని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు అన్నారు.

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ రెండేళ్లలో ఎన్నో కొత్త పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారని చెప్పారు. గతంలో ఏనాడూ లేనివిధంగా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారని అన్నారు.

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

రుణమాఫీ సహా అన్ని అంశాల్లో రైతులకు దన్నుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు.

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కెటి రామారావు, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ బర్గ్‌లెన్సన్‌తో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రి ఫ్యాబ్లెట్‌ను ఆవిష్కరించారు.

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రైతాంగానికి మేలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెటిఆర్ అన్నారు.

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం

అగ్రి ఫాబ్లెట్ ప్రారంభోత్సవం


వ్యవసాయానికి సాంకేతికతను జోడించి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకే ఇక్రిశాట్‌లో కలిసి అగ్రిఫ్యాబ్లెట్‌ను తీసుకువచ్చినట్టు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. వ్యవసాయానికి సాంకేతికతను మేళవిస్తే అధిక దిగుబడులతోపాటు లాభాలు పొందే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికరంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో వ్యవసాయరంగంలోనూ మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

తెలంగాణ రైతుల పంట దిగుబడులు పెరిగేందుకు, పంటలకు లాభసాటి ధరలు రావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేలా వ్యవసాయ, సమాచార సాంకేతికశాఖ, ఇక్రిశాట్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం శుభ పరిణామమని అన్నారు.

ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్‌బర్గ్‌లెన్సన్ మాట్లాడుతూ.. సాంకేతిక సమాచారం వ్యవసాయరంగంలో ఎంతో ఉపయోగమన్నారు. కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

అగ్రి ఫ్యాబ్లెట్

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వాడుకునేలా ఇక్రిశాట్ తయారు చేసిన అప్లికేషన్‌నే అగ్రి ఫ్యాబ్లెట్ అంటారు. వ్యవసాయశాఖలో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)లకు అగ్రి ఫ్యాబ్లెట్‌ను (మొబైల్ ఫోన్‌కు ఐప్యాడ్ ఫీచర్స్ అనుసంధానం చేస్తే దాన్ని ఫ్యాబ్లెట్ అంటారు) అందిస్తారు. దానిలో గ్రామంలోని రైతులకు సంబంధించిన వివరాలు, సర్వే నంబర్లు, పండించే పంటలు సహా ప్రాథమిక సమాచారం నిక్షప్తం చేస్తారు.

English summary
Telangana Minister KTR has unveiled Agri Phablet - Green Phablet - introduced by ICRISAT to digitize the agricultural practices in Telangana as a part of Digital Agriculture and Digital India schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X