హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసలేం జరిగింది?: ప్రాణ స్నేహితుల దుర్మరణంపై పోలీసులు ఏమన్నారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బుధవారం రాత్రి మూసాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితుడు హరికృష్ణ కళ్లెదుటే దుర్మరణం చెందడంతో, అతడి మరణాన్ని జీర్ణించుకోలేని రమేశ్ పక్కనే ఉన్న భరత్ నగర్‌లోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

ప్రాణ స్నేహితుడి మృతితో జీవితంపై విరక్తి చెందో, బంధువుల్లో తాను అభాసుపాపలవుతాననే ఆందోళనతో రమేశ్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు కూకట్ పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు.

 హాస్టల్‌లో ఒకే గదిలో నివాసం

హాస్టల్‌లో ఒకే గదిలో నివాసం


గుంటూరుజిల్లా కారంచేడు మండలం వేపగాంపల్లి గ్రామానికి చెందిన గంట హరికృష్ణ (27), కొత్తపల్లి రమేష్ (26) చిన్ననాటి స్నేహితులు. సమీప బంధువులు. ఉద్యోగాలు చేసుకుంటూ కూకట్ పల్లిలోని వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 304లో ఉంటున్నారు.

 హరికృష్ణ రాయదుర్గంలోని టీసీఎస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్

హరికృష్ణ రాయదుర్గంలోని టీసీఎస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్


హరికృష్ణ రాయదుర్గంలోని టీసీఎస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్ కాగా, రమేశ్ నిజాంపేట్ రోడ్డులోని శ్రీశ్రీహోలిస్టిక్ హాస్పిటల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో హరికృష్ణ, రమేష్ ఇద్దరూ బైక్‌పై ఎస్‌ఆర్‌నగర్ వెళ్లారు.

 ఎస్‌ఆర్‌నగర్ నుంచి తిరిగి వస్తుండగా మూసాపేట్

ఎస్‌ఆర్‌నగర్ నుంచి తిరిగి వస్తుండగా మూసాపేట్


రాత్రి 11:30 గంటలకు ఎస్‌ఆర్‌నగర్ నుంచి తిరిగి వస్తుండగా మూసాపేట్ బస్టాప్ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని లారీ వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీకొట్టంది. హరికృష్ణ, రమేష్ అదుపు తప్పి కింద పడిపోయారు. వెనుక కూర్చున్న హరికృష్ణ తలపైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 హెల్మెట్ ధరించడంతో సురక్షితంగా బయటపడ్డ రమేశ్

హెల్మెట్ ధరించడంతో సురక్షితంగా బయటపడ్డ రమేశ్


బైక్ నడుపుతున్న రమేశ్ హెల్మెట్ ధరించడంతో, సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో ప్రాణ మిత్రుడు కళ్లేదుటే చని పోవడంతో రమేశ్ తీవ్ర ఉద్వేగానికి లోనై మనస్థాపానికి గురయ్యాడు. మిత్రుడి శవాన్నీ, బైక్‌ని అక్కడే వదిలేసి కిలోమీటరు దూరంలోని సనత్ నగర్ ఈ క్యాబిన్ రైల్వే లైను వద్దకు చేరుకున్నారు.

 పుణె ఎక్సప్రెస్ కింద పడి రమేశ్ ఆత్మహత్య

పుణె ఎక్సప్రెస్ కింద పడి రమేశ్ ఆత్మహత్య


అదే సమయంలో పుణె ఎక్సప్రెస్ రావడాన్ని గమించిన దాని ఎదురుగా పట్టాలపై పరుగెత్తుకుంటూ వెళ్లాడు. రైలు డ్రైవర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. రైలు అతడిని చాలా దూరం లాక్కెళ్లడంతో తీవ్రంగా గాయాలు పాలై రమేశ్ మృతి చెందాడు. భరత్ నగర్ రైల్వే సిబ్బంది మృతుడి సిబ్బంది ఫోన్ స్వాధీనం చేసుకుని సోదరుడు శ్రీధర్‌కు సమాచారమిచ్చారు.

 రమేశ్ మృతిపై కూకట్‌పల్లి పోలీసులు ఏమన్నారు

రమేశ్ మృతిపై కూకట్‌పల్లి పోలీసులు ఏమన్నారు

రాత్రి 1.30 గంటల సమయంలో మృతదేహాన్ని పట్టాల నుంచి పక్కుకు తొలగించారు. రమేశ్ మృతిపై కూకట్‌పల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. రమేశ్ మృతిపై నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి వరకూ అక్సెంచర్ సంస్ధలో పనిచేసిన హరికృష్ణ, ఐదు రోజుల క్రితం టీసీఎస్ లో చేరాడు.

 నెలక్రితమే మలేషియా నుంచి హైదరాబాద్‌కు

నెలక్రితమే మలేషియా నుంచి హైదరాబాద్‌కు


రోడ్డు ప్రమాదంలో అక్కకికక్కడే చనిపోయిన హరికృష్ణ నెలక్రితమే మలేషియా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు లారీ డ్రైవర్‌తో లారీని అదుపులోకి తీసుకున్నారు.

English summary
A young man committed suicide after his childhood friend died before his eyes in a road accident in Hyderabad on Wednesday, police said. The tragic incident occurred in the early hours of the day near Moosapet in Kukatpally when the two friends, who were on a motorbike, met with an accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X