వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబోయే గవర్నర్: మోత్కుపల్లిపై వెంకయ్య సంచలనం, ‘రామోజీ ప్రత్యేకం’

తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అవుతున్నారంటూ గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అవుతున్నారంటూ గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. మరో రెండ్రోజుల్లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న వెంకయ్యనాయుడు.. మోత్కుపల్లిని'కాబోయే గవర్నర్' అని సంభోదించారు.

అభిమానమా? దురభిమానమా?: మోడీకి పోటీపై వెంకయ్య ఉద్వేగం, 'బాబంటే ఇష్టం'అభిమానమా? దురభిమానమా?: మోడీకి పోటీపై వెంకయ్య ఉద్వేగం, 'బాబంటే ఇష్టం'

కాబోయే గవర్నరంటూ అభినందనలు..

కాబోయే గవర్నరంటూ అభినందనలు..

బుధవారం ఉదయం తనను కలిసిన తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన వెంకయ్య.. మోత్కుపల్లి నియామకంపై అతి త్వరలోనే శుభవార్త వింటారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా మోత్కుపల్లికి వెంకయ్య అభినందనలు కూడా తెలిపారు. దీంతో మోత్కుపల్లి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. మిగితా టీడీపీ నేతలు కూడా మోత్కుపల్లికి అభినందనలు తెలిపారు.

Recommended Video

Uttar Pradesh CM Yogi Adityanath Resigns
అధ్యయనం చేస్తున్నా..

అధ్యయనం చేస్తున్నా..

రాజ్యసభలో అర్థవంతమైన చర్చ జరిగేలా సభను నడిపిస్తానని.. దీనికోసం సర్వేపల్లి రాధాకృష్ణన్‌, హిదయతుల్లా, జాకీర్‌ హుస్సేన్‌ సభను నడిపిన తీరును అధ్యయనం చేస్తున్నట్లు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తెలిపారు.

చివరి సమావేశం..

చివరి సమావేశం..

హైదరాబాద్‌ సోమాజీగూడలోని ఓ హోటల్‌లో విలేకరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ముందు ఇదే తన చివరి పాత్రికేయ సమావేశమని వెంకయ్య చెప్పారు.

బాధగా ఉంది..

బాధగా ఉంది..

‘ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించగానే ఉగ్వేదానికి గురయ్యా. 20 ఏళ్లుగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇకపై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే బాధగా ఉంది. ఇకపై రాజకీయాలు మాట్లాడను. నేను ఇప్పటివరకు దేశంలోని 623 జిల్లాల్లో పర్యటించా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనీసం 20 సార్లైనా పర్యటించాను. రాజకీయ నేతలు ప్రజల్లో ఉంటేనే రాణిస్తారు' అని వెంకయ్య స్పష్టం చేశారు.

రామోజీ అంటే ఇష్టం..

రామోజీ అంటే ఇష్టం..

ప్రజా జీవనంలోకి వస్తే దేశానికి అవసరమైన విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు. దేశంలో ఉన్న పత్రికాధిపతుల్లో ఈనాడు అధినేత రామోజీరావు అంటే తనకు ప్రత్యేక అభిమానమని తెలిపారు. తాను పని రాక్షసుడినని, తనకు ఇతర ప్రాంతాల్లో పర్యటించడం, మీడియాతో మాట్లాడటం అంటే ఇష్టమని వెంకయ్య తెలిపారు.

English summary
Next Vice president Venkaiah Naidu on Wednesday said that TDP Leader Motkupally Narasimhulu is next governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X