వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ డిఎన్ఏలోనే సహనం: టిఆర్ఎస్ ఎంపీ, పేదరికంపై అసహనం: గల్లా జయదేవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశ డీఎన్ఏలోనే అసహనం అనే పదానికి తావులేదని టిఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మంగళవారం అన్నారు. అసహనం పైన లోకసభలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మాట్లాడారు.

భారత దేశ డీఎన్ఏలోనే అసహనం లేదన్నారు. రాజకీయ లబ్ది కోసమే కొందరు అసహనాన్ని తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రజలను విడదీయొద్దన్నారు. అయినా అసహనం రాజకీయ పార్టీల మధ్యే ఉంది కానీ ప్రజల మధ్య లేదని చెప్పారు.

పేదరికంపై అసహనం కావాలి: గల్లా జయదేవ్

ఎంపీ గల్లా జయదేవ్ సహనంపై స్పందించారు. సహనం అనేది భారతీయుల సంస్కృతిలో భాగమన్నారు. కొందరు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. లౌకికం అన్న పదాన్ని దుర్వినియోగం చేశారని
మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చేసి పశ్చిమ ఆసియాలో శాంతి లేకుండా చేశారన్నారు. అవినీతి, పేదరికంలాంటి అంశాలపై అసహనం అవసరమన్నారు.

MP Boora Narsaiah on intolerance

మత ఘర్షణలు తగ్గాయి

గత ఏడాది దేశంలో కేవలం నాలుగు మత ఘర్షణ సంఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రశ్నకు లోకసభలో సమాధాం చెప్పారు. దేశవ్యాప్తంగా అలాంటి ఘటనలు తగ్గినట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే ఆ సంఘటనలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ప్యానెల్ అవసరం లేదన్నారు. గత ఏడాది సుమారు 650 ఘటనలు చోటుచేసుకున్నట్లు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. అయితే గత అయిదేళ్లలో చోటుచేసుకున్న మత ఘర్షణ సంఘటనలపై విచారణ చేపట్టాలని ఓ బీజేపీ నేత డిమాండ్ చేశారు.

కాగా, అసహనం పైన ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. అసహనం అంశంపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో అసహనంపై మోడీ మాట్లాడనున్నారు. పారిస్ సదస్సు నుంచి తిరిగి వస్తున్న ప్రధాని మోడీ రాజ్యసభలో అసహనం అంశంపై మాట్లాడే అవకాశముంది.

English summary
TRS MP Boora Narsaiah Goud on intolerance in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X