వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

500వ టెస్ట్: చారిత్రక విజయంపై టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఏమన్నారు?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాన్పూర్‌లో జరిగిన చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌లో కివీస్‌పై టీమీండియా గెలవడం చాలా సంతోషంగా ఉందని బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పటిష్టమైన న్యూజిలాండ్‌పై గెలవడం ద్వారా టీమిండియా ఆత్మస్థైర్యాన్ని పెంచుకుందని అన్నారు.

ఇదే స్ఫూర్తితో ఆడితే ప్రస్తుత సీజన్‌లో స్వదేశంలో ఆడే మ్యాచ్‌లన్నింటినీ భారత్‌ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్‌, జడేజా, పూజారా, విజయ్‌, రోహిత్‌శర్మ అద్భుతంగా ఆడారని కొనియాడారు. టీమిండియా సమిష్టి కృషితోనే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని చెప్పారు.

అన్ని మ్యాచ్లలో ఇదే విధంగా ఆడితే టెస్టుల్లో టీమిండియా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను టీమిండియా సొంతం చేసుకుంటుందని ఎమ్మెస్కే ప్రసాద్‌ దీమా వ్యక్తం చేశారు. కాగా, కాన్పూర్‌లో జరిగిన చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 197 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

MSK prasad about big win in historic 500th Test

434 పరుగుల లక్ష్యంలో భాగంగా 93/4 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజైన సోమవారం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 236 పరుగులకే ఆలౌటైంది. టెస్టుల్లో టీమిండియాకు ఇది 130వ విజయం. న్యూజిలాండ్‌పై టెస్టుల్లో భారత్‌కు ఇది 19వ టెస్ట్ మ్యాచ్ విజయం.

500వ టెస్ట్‌: చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన, కివీస్‌పై ఘన విజయం గెలిచే అవకాశాలు నామమాత్రంగా ఉన్న ఈ మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కాలని చూస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్లు షాక్ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, షమీ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించ గలిగింది. ఇక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

English summary
MSK prasad about big win in historic 500th Test .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X