హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాడెన్‌కు వీరాభిమాని: ఐసిస్ కోసం 'ట్రూ అల్లా గ్రూప్' ఏర్పాటుచేసిన ఓమర్

మతం మార్చుకొని ఐసిస్ సానుభూతిపరుడిగా మారిన సుబ్రమణ్యం అలియాస్ ముల్లా ఓమర్ లాడెన్ ‌అంటే పిచ్చి అభిమానం. లాడెన్ జీవిత చరిత్ర గురించి ఆయన ఇంటర్నెట్‌లో అధ్యయనం చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మతం మార్చుకొని ఐసిస్ సానుభూతిపరుడిగా మారిన సుబ్రమణ్యం అలియాస్ ముల్లా ఓమర్ లాడెన్ ‌అంటే పిచ్చి అభిమానం. లాడెన్ జీవిత చరిత్ర గురించి ఆయన ఇంటర్నెట్‌లో అధ్యయనం చేశాడు.

కొన్నిరోజుల క్రితం హైద్రాబాద్ పోలీసులు సుబ్రమణ్యం అలియాస్ ముల్లా ఓమర్ ను అరెస్టు చేశారు. అయితే అతడిని పోలీసులు విచారించారు. సోషల్ మీడియా ద్వారా పలువురిని సుబ్రమణ్యం ఐసిస్ వైపు ఆకర్షించాడని పోలీసులు గుర్తించారు.

Mullah Omer was Laden fan, but lured IS backers on social media

ట్రూ అల్లా గ్రూప్ (TAG) పేరుతో సుబ్రమణ్యం సోషల్ మీడియాలో గ్రూప్ ను క్రియేట్ చేశాడు. అయితే ఈ గ్రూప్‌లో సౌదీ అరేబియా, నైజీరియా, ఆఫ్రికా దేశాల నుండి పెద్ద సంఖ్యలో ఐసిస్ సానుభూతిపరులున్నట్టుగా పోలీసులు గుర్తించారు.అయితే ఇండియా నుండి తక్కువ సంఖ్యలోనే ఈ గ్రూపులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

ఏడురోజుల పాటు పోలీస్ కస్టడీ అనంతరం సుబ్రమణ్యాన్ని గురువారం నాడు నాంపల్లి కోర్టులో హజరుపర్చారు పోలీసులు. కోర్టు ఆయనకు జ్యూడిషీయల్ రిమాండ్ విధించింది. ఒసామా బిన్ లాడెన్ కు సుబ్రమణ్యం వీరాభిమాని. లాడెన్ జీవిత చరిత్ర గురించి ఆయన అధ్యయనం చేశారు.

సుబ్రమణ్యం గుజరాత్, తమిళనాడు, శ్రీనగర్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆయనకు షెల్టర్ ఇచ్చిన ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అయితే సుబ్రమణ్యం అలియాస్ ఓమర్ ఐసిస్ సానుభూతిపరుడనే విషయం ఎవరైతే ఆయనకు షెల్టర్ ఇచ్చారో వారికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఓమర్ గత ఆరు మాసాలుగా వెబ్ ద్వారానే పనిచేస్తున్నాడు. ఐసిస్ సానుభూతిపరులను ఒకే గ్రూపులోకి చేర్చడం కోసం ఆయన పనిచేశాడు.

English summary
Alleged Islamic State (IS) sympathiser Subrahmaniam alias 'Mullah Omer', who was arrested by Counter-Intelligence sleuths a few days ago, and like-minded persons created a social media group, 'True Allah Group' (TAG), to ensure the Caliphate becomes a reality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X