వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటీషియన్ 'రాసలీల' వీడియో: రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు!?..

సిరిసిల్ల రాజీవ్ నగర్ ఏరియాలోని ఒక స్థావరంలో జిల్లాకు చెందిన ఓ కౌన్సిలర్ ఈ వ్యవహారానికి తెరలేపారని తెలుస్తోంది. ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు కౌన్సిలర్..

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల: సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన ఓ కౌన్సిలర్ రాసలీల వ్యవహారంలో అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. స్థానిక యువకులు కొందరు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్స్ యువకుల వద్ద ఉండటంతో.. అవి బయటకు లీక్ అవకుండా ఉండేందుకు సదరు కౌన్సిలర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల రాజీవ్ నగర్ ఏరియాలోని ఒక స్థావరంలో జిల్లాకు చెందిన ఓ కౌన్సిలర్ ఈ వ్యవహారానికి తెరలేపారని తెలుస్తోంది. ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు కౌన్సిలర్.. కాలనీలోని ఓ స్థావరంలో తన రాసలీలలు సాగిస్తున్నట్లు స్థానిక యువకులు గుర్తించారు. దీంతో ఆయన్ను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భావించిన యువకులు.. ఎట్టకేలకు ఆ వ్యవహారాన్ని వీడియో తీసినట్లు తెలుస్తోంది.

 municipal councillor extra marital affair in siricilla

కౌన్సిలర్ రాసలీల వీడియో గురించి శనివారం రాత్రి జోరుగా ప్రచారం జరగడంతో.. ఇప్పటికే ఆ నాయకుడు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. ఎలాగైనా వీడియో బయటకు రాకుండా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సిరిసిల్ల సీఐ శ్రీనివాసరావును ఆరా తీయగా.. ఆయన మాత్రం తమకెలాంటి సమాచారం లేదనడం గమనార్హం.

English summary
A Municipal councillor illicit affair was revealed by local youth in Siricilla district. The councillor was trying to recover the damage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X