మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీవ్ కొట్టాడా, శిరీష అక్కడే చనిపోయిందా, చంపేశారా?: తెరపైకి ఆ యువతి

కుకునూర్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య, ఫిలింనగర్‌లో బ్యూటిషియన్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇరువురి మృతికి సంబంధం ఉందా? ఉంటే అసలేం జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కుకునూర్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య, ఫిలింనగర్‌లో బ్యూటిషియన్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇరువురి మృతికి సంబంధం ఉందా? ఉంటే అసలేం జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

అయితే వారి మృతిపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసిందని ప్రచారం సాగుతోంది. శిరీష ఎలా చనిపోయింది? ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? పోలీసు క్వార్టర్స్‌లో రాజీవ్ కొట్టిన దెబ్బలకు మరణించిందా?

కుకునూరుపల్లి పోలీసు క్వార్టర్స్‌లో మరణించిన శిరీష మృతదేహన్ని ఎస్సై సూచనల మేరకు హైదరాబాద్ తీసుకుని వచ్చి ఆత్మహత్య నాటకం ఆడారా? అనే కోణాల్లోను పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది.

పోలీసల విచారణలో కీలక విషయాలు చెబుతున్న రాజీవ్

పోలీసల విచారణలో కీలక విషయాలు చెబుతున్న రాజీవ్

పోలీసుల విచారణలో ఉన్న రాజీవ్, శ్రవణ్‌లు పలు విషయాలు చెబుతున్నారని తెలుస్తోంది. వారు చెప్పిన వాటిని కూడా పోలీసులు నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇవన్నీ తేలాలంటే తొలుత పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది.

అప్పుడే మిస్టరీకి తెర

అప్పుడే మిస్టరీకి తెర

పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ మిస్టరీకి తెరపడుతుందని అంటున్నారు.శిరీష మరణం వెనుక ఎస్సై పాత్ర ఉందనే అనుమానాల నేపథ్యంలో అసలు శిరీష ఏ విధంగా చనిపోయిందన్న విషయం స్పష్టమయితే కానీ మిగతా సమస్యలు పరిష్కారం కావని భావిస్తున్నారు.

మరో యువతిని విచారించే అవకాశం

మరో యువతిని విచారించే అవకాశం

శిరీషను కుకునూరుపల్లికి తీసుకుని వెళ్లిన వారిలో రాజీవ్, శ్రవణ్‌లు కీలకం కాగా, అసలు వీరి సమస్యకు కారణమైన మరో యువతిని విచారించాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆత్మహత్య లేదా హత్య..

ఆత్మహత్య లేదా హత్య..

ఒకవేళ శిరీష కనుక హైదరాబాద్‌లోనే ఆత్మహత్య చేసుకున్నట్లితే ఆమె ఆత్మహత్యకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌తో పాటు వివాదానికి కారణమైన యువతి పేరు చేర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, శిరీష కనుక ఎస్సై క్వార్టర్లలోనే చనిపోతే మాత్రం హత్య కేసు కింద మార్చాల్సి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.

చిక్కుముడులు విప్పేందుకు..

చిక్కుముడులు విప్పేందుకు..

శిరీష మరణం చుట్టూ అలుముకున్న చిక్కుముడులను విప్పుతూ కేసు మిస్టరీని చేధించడానికి గత రాత్రంతా ఇద్దరు డీసీపీలు, సీనియర్ ఇన్స్‌పెక్టర్లు పోలీస్ స్టేషన్లోనే మకాం వేశారట. రాజీవ్, శ్రవణ్‌లను మరోసారి విచారించారు. వీరి కాల్ డిటైల్స్ పరిశీలించారు.

English summary
A police sub-inspector allegedly committed suicide on Wednesday by shooting himself with his service weapon in Siddipet district, the police said. This is the second such incident at the same police station as another sub-inspector had ended his life by shooting himself in August, last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X