వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణ కాలేజీలో విద్యార్థుల రచ్చ: పోలీసులనే హడలెత్తించారు.. అసలేమైంది?

యాజమాన్యం బుజ్జగింపులకు విద్యార్థులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. మంగళవారం అర్థరాత్రి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులపై కూడా విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పిన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజాంపేటలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు రచ్చ రచ్చే చేశారు. ఔటింగ్ ఇవ్వలేదన్న కారణంతో తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. కళాశాలలోని ఫర్నీచర్, లైట్లు, పైప్ లైన్లను ధ్వంసం చేశారు. హాస్టల్లో భోజనం బాగుండడం లేదని బెడ్ సౌకర్యాలు కల్పించడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

యాజమాన్యం బుజ్జగింపులకు విద్యార్థులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. మంగళవారం అర్థరాత్రి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులపై కూడా విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపించింది. దీంతో వారిని శాంతింపజేయడం పోలీసులకు తలకు మించిన భారంలా తయారైంది.

 Narayana College Students Destroyed College Furniture and Lights For Outing

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఔటింగ్ వెళ్లడానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెప్పించుకుంటే సరిపోతుందని, అలా కాకుండా కళాశాలలో విధ్వంసం సృష్టించడం ఎంతవరకు సమంజసం అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురూ సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తేనే మెరుగైన సమాజం నిర్మించవచ్చునని, పిల్లలు ఇలా చిన్న విషయాలకే విధ్వంసానికి పాల్పడితే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం తీసుకోవాలన్నారు.

English summary
Narayana College Students Destroyed College Furniture and Lights For Outing in Nizampet campus. Police entered into the campus and stopped students attack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X