వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకే కాదు, ఏపీకి ప్రాధాన్యతనివ్వట్లేదు: మోడీపై కవిత ట్విస్ట్, జెపీ స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విదేశాలతో సంబంధాలను అభివృద్ధి చేసుకోవటం ముఖ్యమైనదేనని, కానీ కొత్త రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వటం కూడా చాలా అవసరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోడీ విదేశీ పర్యటనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదని, కొత్త రాష్ట్రం తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఒక్కసారైనా తెలంగాణకు రాకపోవడం బాధాకరమన్నారు. మోడీజీ కనీసం ఒకసారి తెలంగాణను సందర్శించకపోవడం ఆయన అవగాహనను సూచిస్తోందా లేక కొత్తరాష్ట్రం అభివృద్ధి మీద ఆయనకు ఆసక్తి లేదా అనేది తనకైతే అర్థం కావడం లేదన్నారు.

మోడీ అనేక దేశాలు పర్యటించడాన్ని ప్రస్తావిస్తూ.. బయటిదేశాలతో సంబంధాలు ముఖ్యమేనని, అదే సమయంలో మన సొంత రాష్ట్రాలతో.. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ వంటి కొత్త రాష్ర్టాలతో సంబంధాలు కూడా అంతే ముఖ్యమన్నారు.

NDA govt not supportive of Telangana: TRS MP Kavitha

రెండు రాష్ట్రాలను కేంద్రం ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రధాని మోడీ పదవి చేపట్టిన తర్వాత పర్యటనకు రాకపోవడం పట్ల రాష్ట్ర ప్రజలు బాధకు గురయ్యారా అన్న ప్రశ్నకు ఆమె ఔనని చెప్పారు. చిన్న విషయాలపై కూడా తెలంగాణ తన హక్కుల కోసం కేంద్రం దగ్గర పోరాడాల్సి వస్తోందన్నారు.

రాజ్యాంగ విభాగమైన రాష్ట్రాన్ని పద్ధతిగా గౌరవించాల్సి ఉందని, ఏపీకి సైతం అలాంటి గౌరవం దక్కుతోందని తాను భావించడం లేదన్నారు. హైకోర్టు విభజనపై కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సైతం ఇవ్వలేదన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు అడిగామని, అవి కూడా రాలేదన్నారు.

2014 రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు ప్రస్తావనే లేదని, మేం అభ్యంతరం తెలిపామని, ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా అన్నిటి కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం తెలంగాణ డేటాను విడిగా ఇచ్చేది కాదని, ఎంపీలు అదేపనిగా వెంటపడితే ఇప్పుడిప్పుడే మెల్లగా ఇవ్వడం మొదలుపెట్టారన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయన్నారు.

తెలంగాణకు కేంద్రం సహకారం: కేంద్రమంత్రి జేపీ నడ్డా

తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా బుధవారం అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు త్వరలో నిధులు ఇస్తుందని చెప్పారు. నల్గొండలో ఫ్లోరైడ్ నివారణకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. దేశంలోనే యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రం అవుతుందన్నారు.

English summary
The NDA government is not supportive of Telangana and the new State is forced to fight for its rights, said TRS leader Kalvakuntla Kavitha as she expressed "hurt" over Prime Minister Narendra Modi not paying a single visit since assuming charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X