వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్ నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారు: కెసిఆర్

తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు, నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు జలవిహర్ లో టిఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు, నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు జలవిహర్ లో టిఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న కోవింద్ ప్రచారనిమిత్తం ఆయన మంగళవారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు. గవర్నర్ గా నేను పార్టీలకు అతీతంగా పనిచేశాను. కుల, మత ప్రాంతాలకు అతీతంగా పనిచేశానని చెప్పారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశం అభివృద్ది చెందాలన్నారు. అదే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్టు చెప్పారు.

అదే తన లక్ష్యమన్నారు యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు , ఆధునిక విద్య అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రపతి పదవి అత్యంత పవిత్రమైంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. తాను ఏ రాజకీయపార్టీలో చేరలేదన్నారు.

 NDA presidential candidate campaigns started in Telangana state

ప్రస్తుతం నేను ఏ రాజకీయపార్టీతో అనుబంధంగా లేనని చెప్పారు నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాల్సిందిగా ఆయన కోరారు. ఇక నన్ను స్వాగతిస్తూ తెలంగాణ సిఎం కెసిఆర్ హైద్రాబాద్ అంతా కటౌట్లు పెట్టించారు. హిందీలో ప్రసంగించారు. ఇందుకు ఆయన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతిగా పనిచేసిన జాకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందినవారేనని ఆయన గుర్తుచేశారు.

కోవింద్ కు టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఎన్ డి ఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు కెసిఆర్. రాష్ర్టపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కు భారీ విజయం దక్కుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో తన ప్రగతి కోసం మీ ఆశీస్సులు కోరుకొంటుందన్నారు కెసిఆర్. రాష్ట్రపతి కార్యాలయంలో పూర్తి సఫలత సాధించాలని ఆశిస్తున్నట్టు చెప్పారాయన.
దేశాన్ని ఆర్థిక వృద్ది దిశగా తీసుకెళ్తున్నట్టు ప్రధాని మోడీకి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు సిఎం. అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా మారిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు.

English summary
NDA presidential candidate campign started in Telangana state. he has met with Trs and Bjp legislators in Jalavihar at Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X