వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఏల్ఏ లే...కొత్త జిల్లాల పార్టీ అధ్యక్షులు..... కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులు..

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు పార్టీ భాద్యతలను కొత్త వారికి అప్పగించనున్నారు. జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాలకు ఆయా జిల్లాల నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న సీనియర్లు...లేదా ఎంఏల్ఏలకు భాద్యతలను అప్పగించనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు గాను టిఆర్ఎస్ చీఫ్ కొత్త జిల్లాల్లో కూడ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటివరకు 10 జిల్లాలే ఉన్నాయి. కొత్తగా మరో 21 జిల్లాలు ఏర్పాటు కావడంతో ,....కొత్త జిల్లాల్లో కూడ కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ చీఫ్ కెసిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన జిల్లాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఏల్ఏలకు జిల్లా అధ్యక్ష భాద్యతలను కట్టబెట్టనున్నారు. అధ్యక్ష పదవి విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు..ఎంఏల్ఏలు లేదా సీనియర్ నాయకులకు జిల్లా పార్టీ అధ్యక్ష భాద్యతలను అప్పగించనున్నారు.

new districts...new chiefs for the new districts

ఏడాదిన్నర క్రితం జిల్లా,రాష్ట్ర స్థాయి కమిటీల భర్తీ ఇంకా పూర్తి చేయలేదు. ఈ కమిటీల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. కొత్త జిల్లాల్లో అధ్యక్ష పదవులతో పాటు....ఖాళీగా ఉన్న కమిటీలన్నింటిని పూర్తి చేయాలని టిఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.కొత్తగా ఏర్పాటైన మండల కమిటీలకు కూడ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ క్యాడర్ పనితీరును అంచనా వేసే అవకాశం కూడ కలుగుతోంది.

జిల్లాల పరిది తగ్గింది. గతంలో పెద్దగా ఉన్న జిల్లాలు ప్రస్తుతం చిన్నవిగా మారాయి. ప్రజలతో మమేకం కావడానికి ఉపయోగంగా ఉంటుంది. ఒక్కో జిల్లాల్లో కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాలే ఉండే అవకాశం ఉంది.దీంతో ప్రజలతో సన్నిహిత సంబందాలు కలిగి ఉండేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంఏల్ఏలను నియమిస్తే ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా పార్టీ వ్యవహారాలను ఎంఏల్ఏలు సమర్థవంతంగా నిర్వహిస్తారా....లేదా అనే అభిప్రాయం కూడ లేకపోలేదు. ఈ విషయమై అద్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
trs chief will recrute new districts party presidents soon. trs mlas will be recrute as a newly created district presidents.mlas suitable for this post for strenthening the party.party chief examine this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X