హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నమ్మకాన్ని నిలబెట్టాలి: బొంతు రామ్మోహన్‌కు కెసిఆర్ ఆత్మీయ ఆలింగనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌‌నుముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కలిసిన వారు తమను ఈ పదవులకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చాలని, నమ్మకాన్ని నిలబెట్టాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నూతన మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా ఎంపికైన బాబా ఫసియుద్దీన్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు అభినందించారు. సెక్రటేరియట్‌లో మంత్రులను కలిసి వారు తమ ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సేవకుడినే

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. తాను పాలకుడిని కాదు.. సేవకుడిని అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా, మంత్రి కే తారక రామారావు దిశానిర్దేశంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. బల్దియాను అవినీతి నుంచి పూర్తిగా విముక్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు.

మేయర్ బొంతు రామ్మోహన్, కెసిఆర్ ఆత్మీయ ఆలింగనం

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

గ్రేటర్ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్ధీన్‌‌నుముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు.

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

మేయర్‌గా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కలిసిన వారు తమను ఈ పదవులకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చాలని, నమ్మకాన్ని నిలబెట్టాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

గ్రేటర్ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్ధీన్‌‌నుముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు.

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చాలని, నమ్మకాన్ని నిలబెట్టాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్

కెసిఆర్‌తో బొంతు రామ్మోహన్



మేయర్‌గా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కలిసిన వారు తమను ఈ పదవులకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రితో మేయర్, డిప్యూటీ మేయర్

మంత్రితో మేయర్, డిప్యూటీ మేయర్

గ్రేటర్ హైదరాబాద్ నూతన మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా ఎంపికైన బాబా ఫసియుద్దీన్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు అభినందించారు. సెక్రటేరియట్‌లో మంత్రులను కలిసి వారు తమ ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

గురువారం ఉదయం 11 గంటలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్‌ ఎన్నికల కోసం సమావేశాన్ని నిర్వహించారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

ముందుగా 150 మంది కార్పొరేటర్లతో ఎన్నికల నిర్వహణ అధికారి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులు తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లంలలో ఎవరికి నచ్చిన భాషలో వారు ప్రమాణం చేశారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేయర్‌ పదవికి బొంతు రామ్మోహన్‌ పేరును కార్పొరేటర్‌ కవిత ప్రతిపాదించగా మరో సభ్యుడు కొల్లూరి అంజయ్య సమర్థించారు. ఒకే నామినేషన్‌ రావడంతో మేయర్‌గా రామ్మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాహుల్‌ బొజ్జా ప్రకటించారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

అనంతరం డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్ధీన్‌ పేరును కార్పొరేటర్‌ శేషుకుమారి ప్రతిపాదించగా మరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సమర్థించారు. దీనికి కూడా ఒక్కటే నామినేషన్‌ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

మేయర్‌, డిప్యూటీ మేయర్లు ఇద్దరినీ సమర్థిస్తున్నట్లు ఎంఐఎం కార్పొరేటర్‌ అయేషా రూబిన్‌ తమ పార్టీ తరఫున తెలిపారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

ఈ ఎన్నికకు ముందు టిఆర్ఎస్ కార్పొరేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అవినీతికి దూరంగా ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని కొత్త కార్పొరేటర్లకు కేటీఆర్‌ సూచించారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

తెరాస ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయరాదన్నారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ

ఎన్నికలు పూర్తి కాగానే జై తెలంగాణ నినాదాలతో కౌన్సిల్ హాలు ప్రాంగణం మార్మోగింది.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ


అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి కార్పొరేటర్లు కాలి నడకన గన్‌పార్క్‌కు ర్యాలీగా తరలివెళ్లి అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు.

గన్‌పార్క్‌కు ర్యాలీ

గన్‌పార్క్‌కు ర్యాలీ



ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహేందర్‌ రెడ్డి, జగదీశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Corporators from Cherlapally Bonthu Rammohan Rao, and Borabanda, Baba Fasiuddin MD were on Thursday unanimously elected the Greater Hyderabad mayor and deputy mayor respectively by the newly-elected corporators and ex-officio members at the GHMC council hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X