వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఏపీకి గజం భూమి కూడా దక్కదు', 'తెలంగాణది మొండి వాదన'

ఆగ్రో ఆస్తులు అన్నీ తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని, తెలంగాణ నుంచి గజం భూమి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కదని ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు సోమవారం నాడు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆగ్రో ఆస్తులు అన్నీ తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని, తెలంగాణ నుంచి గజం భూమి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కదని ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు సోమవారం నాడు తెలిపారు.

ఆర్టీసీ, డెయిరీ, ఆగ్రో, ఏపీ ఫుడ్స్ సంస్థల విభజనపై మంగళవారం కేంద్ర హోంశాఖతో జరిగిన తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ ముగిసింది. పూర్తి ప్రాజెక్టు రిపోర్టులతో మరోసారి రావాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

ఆగ్రోకు ఉన్న స్థిరాస్తుల వివరాలు కూడా తీసుకురావాలని చెప్పింది. ఈ సందర్భంగా లింగంపల్లి కిషన్ రావు మాట్లాడారు.

andhra pradesh
నిజాంపాలనలో మౌలాలిలో ఏర్పాటైన ఫెర్టిలైజర్స్‌లో ఏపీ రాష్ట్రం వాటా కోరడం దారుణం అన్నారు. ఆగ్రో ప్రధాన కార్యాలయం అద్దె భవనంలో ఉందన్నారు.

డెయిరీ విభజనపై ఏపీ వాదనలు వినిపించామని ఏపీ డెయిరీ కార్పోరేషన్ ఎండీ మురళి అన్నారు. ఏపీ డెయిరీకి సోమాజిగూడలో గెస్ట్ హౌజ్, 1.4 ఎకరాల స్థలం, 44 ఎకరాల్లో ప్రధాన కార్యాలయం ఉందన్నారు. ప్రధాన కార్యాలయంలో అనుబంధ సంస్థలకు వాటా లేదని తెలంగాణ మొండిగా వాదిస్తోందన్నారు.

English summary
No land for AP in Agro, says Agro chairman Kishan Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X