వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ‘రాష్ట్రపిత’: చిన జీయర్‌స్వామి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ఎన్నో ఉద్యమాలు.. మరెన్నో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం చల్లగా, చక్కగా ఉండాలన్నదే తన తపనని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తల తెగిపడినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించేది లేదని స్పష్టం చేశారు.

సోమవారం కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. 2017 నాటికి విద్యుత్ కోతలు అధిగమించి, 2018నుంచి నిరంతర విద్యుత్ అందించబోతున్నట్టు కెసిఆర్ స్పష్టం చేశారు. 2019 నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని తెలిపారు.

2019లోగా రాష్ట్ర ప్రజానీకానికి వాటర్ గ్రిడ్ ద్వారా పల్లె, పట్నం తేడాలేకుండా ఇంటింటికి తాగునీరు అందిస్తామని ప్రకటించారు. నీరు అందించకపోతే 2019 ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని చెప్పారు. సీమాంధ్రుల పాలనతో వట్టిపోయిన తెలంగాణ చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా పూర్వవైభవం తెచ్చి రాష్ట్ర రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. గ్రామాల్లోని చెరువులకు జలకళ తెచ్చి, పచ్చని తెలంగాణను ప్రపంచపటంలో చూపుతామన్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించి పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు.

బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని, ఎక్కువ శాతం కార్మికులకు ఆసరా అందకపోవటంతో, వీరికోసం ‘జీవనభృతి'ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. బీడి కార్మికులు ఎవరైన తప్పిపోతే ఆందోళనకు గురికాకుండా వెంటనే తహాశీల్దార్‌కు ధరఖాస్తు చేసుకుంటే ఈ నెలతోనే ఫించన్ అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతకుముందు మండల కేంద్రంలో ప్రతిష్టించిన కొమరం భీం విగ్రహావిష్కరణ, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవన సముదాయ ప్రారంభం, ఆడిటోరియానికి శంకుస్థాపనలాంటి కార్యక్రమాల్లో సిఎం పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పిత కెసిఆర్: చిన్న జీయర్ స్వామి

కెసిఆర్

కెసిఆర్

ఎన్నో ఉద్యమాలు.. మరెన్నో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం చల్లగా, చక్కగా ఉండాలన్నదే తన తపనని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తల తెగిపడినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించేది లేదని స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

సోమవారం కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎందరో అభాగ్యులు ఆలనా పాలనాలేక అన్నమో రామచంద్రా అంటూ అర్థిస్తున్నారని, అలాంటివారి కోసమే ‘ఆసరా' ప్రారంభించామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ పథకం ద్వారా ఏటా రూ.4వేల కోట్లకుపైగా ప్రభుత్వంపై భారం పడుతున్నా, అభాగ్యులను ఆదుకునే సంకల్పంతో ఆ భారాన్ని భరించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు.

కవిత

కవిత

అర్హులైన వారికి పింఛన్లు అందకపోతే ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని, ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. పది రోజుల్లో అధికారులు పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారని సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

2017 నాటికి విద్యుత్ కోతలు అధిగమించి, 2018నుంచి నిరంతర విద్యుత్ అందించబోతున్నట్టు కెసిఆర్ స్పష్టం చేశారు. 2019 నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ విజయంతో కేసీఆర్‌ను తెలంగాణ పితగా తాము గుర్తిస్తున్నామని త్రిదండి చిన్నజీయర్‌స్వామి అన్నారు. సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో సాగించాలన్న తపన, లక్ష్యం ముఖ్యమంత్రిలో కనిపిస్తున్నాయని ప్రశంసించారు. కేసీఆర్ అచరణలో తన లక్ష్యాలను సాధించితీరుతారని, అందుకు తమ అశీస్సులు ఎప్పుడు ఉంటాయని స్వామి ఆశీర్వదించారు. గిరిజన సంస్కృతిని రక్షించేందుకు జీయర్ ట్రస్టు కృషి చేస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన మంత్రి జౌలోరాం, రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి చందులాల్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు తాటిపర్తి జీవన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, బొడిగేశోభ, సోమారపు సత్యనారాయణ, గంగుల కమలాకర్, వొడితెల సతీష్‌కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

English summary
Chief Minister K Chadrashekar Rao declared that by the end of 2018, there will be no power cuts in Telangana. He said the State will also be able to provide 2,300 MW of power to neighbouring States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X