వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళ్లు: పీస్ మార్చ్‌లో ఆలోక్

శ్రీనివాస్ కూచిభొట్లకు వందలాది మంది అమెరికాలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు పీస్ మార్చ్ నిర్వహించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హ్యూస్టన్: అమెరికాలోని కాన్సస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో బుధవారంనాడు మరణించిన శ్రీనివాస్ కూచిభొట్లకు వందలాదిమంది ప్రజలు అమెరికాలో నివాళులు అర్పించారు. కాన్సాస్ నగరంలో 'శాంతి, ఐకమత్యం' పేరుతో పీస్ మార్చ్ నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతుల్లో ధరించి మార్చ్‌లో పాల్గొన్నారు.

'వియ్ వాంట్ పీస్', 'వియ్ లవ్ పీస్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొవ్వొత్తులు చేతుల్లో ధరించి ముందుకు సాగారు. రాజకీయ జాత్యహంకారానికి మేం మద్దతు ఇవ్వబోమంటూ నినాదాలు చేశారు. కాల్పుల ఘటన నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాదసానితోపాటు కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కోలియర్, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడెర్, ఒలాథె మేయర్ మైక్ కోప్‌ల్యాండ్, ఓల్‌థే పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకె, ఇతర అధికారులు ఈ ప్రేయర్ మీట్‌కు హాజరయ్యారు.

NRIs pay tribute to Srinivas Kuchibhotla

కన్సాస్‌లోని హిందూ ఆలయం, కల్చరల్ సెంటర్‌లో వివిధ మతాలకు చెందిన వారు ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, క్రిస్టియన్, జెవిష్, ముస్లిం, సిక్కు ప్రార్థనలతో మొదలై జాన్ లెనాన్ 'ఇమాజిన్' పాటతో ప్రార్థనలు ముగిశాయి.

శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహం అమెరికా నుంచి హైదరాబాదుకు వస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్ల మృతి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

English summary
NRI paid tributes to Srinivas Kuchibhotla, who died in Kansas firing. His dead body is reaching Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X