వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘క్షమాపణ చెప్పకుంటే.. రేవంత్‌పై భౌతిక దాడులు తప్పవు’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు ఓటు కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్, నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డికి టిడిపి నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకడంపై మండిపడ్డారు.

బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఓయూ గెస్ట్‌హౌజ్‌లో వంగపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ధనబలంతో విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డి, అతని అనుచరులపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.

గతంలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో దొరికిన కృష్ణాయాదవ్‌ను సస్పెండ్ చేసిన చంద్రబాబు... ప్రస్తుతం రేవంత్‌రెడ్డిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారో స్పష్టం చేయాలన్నారు.

OU Students fires at Revanth Reddy
ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా వ్యవహరించి జైలు కెళ్లిన ఆయనను.. ఏదో ఘనకార్యం సాధించి తిరిగివస్తున్నట్లుగా పచ్చదండు స్వాగతం పలకడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌లో మాదిగలపై దాడులు చేయించిన అగ్రకుల దురహంకారి రేవంత్‌రెడ్డికి తెలంగాణలో తిరిగే నైతికహక్కు లేదని అన్నారు. బడుగులకు ఒక న్యాయం.. అగ్రకులాలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగకు ఫెక్సీలు, బ్యానర్లు పెట్టుకొని ర్యాలీలు తీయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

మాదిగలపై దాడులు చేయించిన రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు వెంటాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ నాయకులు అలెగ్జాండర్, కొల్లూరి వెంకట్, పాల్వాయి నగేష్, నర్సాని రమేశ్, గోవర్ధన్, శాగంటి రాజేశ్, తిరుపతి, ప్రశాంత్, ప్రవీణ్, తిరుమలేశ్, మధు, తిరుపతి, వెంకన్న, బోనాల నగేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

English summary
Osmania University students on Wednesday fired at TDP MLA and Vote for cash accused Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X