వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ: కేసు కొనసాగుతుందని స్మిత, ఔట్‌లుక్ మాధవికి బెదిరింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పేషీ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై ప్రచురించిన కథనంపై (జూలై 6) అవుట్ లుక్ ఆంగ్ల వారపత్రిక విచారం వ్యక్తం చేసింది. ఈ కథనంలో ఎవరి పేరును తాము ప్రస్తావించలేదని తెలిపింది. ఎవరినీ నష్టం కలిగించాలని లేదా కించపరిచే ఉద్దేశ్యం లేదని తెలిపింది.

అయితే, స్మితా సబర్వాల్ మాత్రం కేసు పైన తగ్గడం లేదు. సదరు పత్రిక వివరణను తాను క్షమాపణగా భావించడం లేదని, వారు ఇలా చేయడం ఏమాత్రం సరికాదని, వారి పైన లీగల్ చర్యలు కొనసాగుతాయని చెప్పారని తెలుస్తోంది.

 Outlook: Smita Sabharwal to continue case

అవుట్ లుక్ అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాకు బెదిరింపులు

అవుట్ లుక్ అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాకు సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వస్తున్నాయని, ఆమెకు తగిన రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీని, మహిళా కమిషన్‌ను కోరారు.

చర్యలు తీసుకోవాలి

స్మితా సబర్వాల్‌ను కించపరిచే కథనం ప్రచురించిన అవుట్ లుక్ పత్రిక పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలో అరవింద్ రెడ్డి, అంజన్ రావు తదితరులు గురువారం సచివాలయంలో స్మితను కలిసి సంఘీభావం తెలిపారు.

English summary
Outlook magazine put up a regret note on its website and also requested the Telangana DGP to protect its correspondent from threats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X