వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నష్టం జరిగినా మౌనమేనా?: కెసిఆర్‌పై పాల్వాయి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు నీటి కేటాయింపులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ నిర్మిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మౌనంగా ఎందుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టమని పాల్వాయి అన్నారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమతో పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందన్నారు. గోదావరి జలాలు వినియోగించుకోవడంపై సిఎం కెసిఆర్ దృష్టి సారించాలన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

Palvai questions KCR's silence on Pattiseema project

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా రాదని సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ తేల్చిందన్న విషయాన్ని పాల్వాయి గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేలకుండా ప్రాజెక్టులను రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుందని పాల్వాయి అన్నారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో కెసిఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని పాల్వాయి గోవర్దన్‌రెడ్డి విమర్శించారు. పట్టిసీమపై చర్చించేందుకు అఖిలపక్ష కమిటీ వేయాలని, గోదావరిపై ఏడు ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Congress MP Palvai Janardhan Reddy on Tuesday questioned CM K Chandrasekhar Rao's silence on Pattiseema project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X