హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చావే శరణ్యం: సిరంజితో పొడుచుకుని గొంతు కోసుకున్న రోగి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఓ రోగి ఆత్మహత్యయత్నం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే హనుమంతు అనే రోగి గత కొంతకాలంగా ఛాతి సంబంధించిత వ్యాధితో చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అతడికి సరైన చికిత్స అందించక పోవడంతో ఆరోగ్యం క్షీణించింది.

దీంతో చావే శరణ్యం అనుకున్న రోగి హనుమంతు శుక్రవారం ఆత్మాహత్యాయత్నం చేశాడు. సిరంజితో పొడుచుకుని గొంతు కోసుకున్నాడు. ఈ సమయంలో హనుమంతు బెడ్ పక్కనే ఉన్న మరో రోగి చూసి హనుమంతుని అడ్డుకోవడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు.

patient suicide attempt at erragadda chest hospital

వెంటనే సమాచారం అందుకున్న చెస్ట్ ఆసుపత్రి అధికారులు హనుమంతుని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని, ప్రాణపాయం నుంచి తప్పించుకున్నట్లు వైద్యులు తెలిపారు.

భార్యను చంపి చెట్టుకు ఉరేసిన భర్త

భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు సహజం. అలాంటిది చిన్నపాటి అభిప్రాయ బేధంతో గొడవపడి భార్యను చంపేసి చెట్టుకు ఉరేశాడో భర్త. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లాలోని ఆత్మకూరు (ఎస్)లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... శెట్టింగూడంకు చెందిన వెంకన్న, జ్యోతి(23) దంపతులు బోయిపాడు జాతరకు వెళ్లారు.

జాతరలో ఉండగా ఓ విషయమై వారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జాతర నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం వెంకన్న భార్య జ్యోతిని హత్య చేసి ఓ చెట్టుకు వేలాడదీసి అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బోయిన్‌పల్లిలో యువతి అనుమానాస్పద మృతి

నగరంలోని బోయిన్‌పల్లి వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి తాను పని చేస్తున్న కంపెనీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతిపై ఆమె తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమ కూతురు మృతికి లాబోరేటరీ యజమానే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని తమ కూతురును గత కొంతకాలంగా యజమాని వేధించాడని పేర్కొన్నారు. మృతురాలిని సమతగా పోలీసులు గుర్తించారు.

English summary
patient suicide attempt at erragadda chest hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X